TS : జూన్ 9 నుండి చేప ప్రసాదం పంపిణిః బత్తిని కుటుంబం వెల్లడి
- By Latha Suma Published Date - 03:43 PM, Mon - 20 May 24

Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ(Battini family) సభ్యులు చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణి కార్యక్రమం సాగుతుందని బత్తిని కుటుంబం వెల్లడించింది. హైదరాబాద్(Hyderabad)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్(Exhibition Ground)లో చేపప్రసాదం అందిస్తామని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా బత్తిని కుటుంబం వారు తెలిపారు. ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ చేపమందు పంపిణీ మొదలవుతుందని వారు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక.. చేప ప్రసాదం పంపిణీ జూన్ 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.. ఆ తర్వాత రోజు జూన్ 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కొనసాగనుంది. చేప ప్రసాదం పూర్తిగా భక్తులకు ఉచితంగానే అందించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు ఎప్పారు. వివిధ ఫౌండేషన్ల సహకారంతో.. మెడికల్ సర్వీస్, భోజన సౌకర్యం, మంచి నీటి సరఫరా 24 గంటల పాటు భక్తులకు ఉచితంగానే అందుతాయని వారు పేర్కొన్నారు. ఇక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చూస్తుంటారు.
Read Also: Bharatiya Nyaya Sanhita : కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ
కాగా, ఈ చేపప్రసాదాన్ని వివిధ అనారోగ్యాల నివారణకు తీసుకుంటుంటారు భక్తులు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు చేప మందును తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం అందించిన సహాయకారమే.. ఇప్పుడూ అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.