Bharatiya Nyaya Sanhita : కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాక.. వాటి పనితీరును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రెజెక్ట్ చేసింది.
- Author : Pasha
Date : 20-05-2024 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
Bharatiya Nyaya Sanhita : మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాక.. వాటి పనితీరును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రెజెక్ట్ చేసింది. ఈ చట్టాలు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదని, ఇప్పుడే వీటిపై కమిటీని ఎలా నియమిస్తారని న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అప్పీల్ దాఖలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సుప్రీంకోర్టు బెంచ్ మండిపడింది. మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై స్టే విధించాలంటూ న్యాయ వాది విశాల్ తివారీ వినిపించిన వాదనతో ఏకీభవించలేదు. దీనిపై అతిగా వాదిస్తే జరిమానా విధిస్తామని పిటిషనర్ (న్యాయవాది విశాల్ తివారీ)కు వార్నింగ్ ఇచ్చింది. దీంతో సదరు పిటిషనరు తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇందుకోసం పిటిషనర్‌కు కోర్టు అనుమతిని మంజూరు చేసింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘చాలా మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నందున వల్లే ఎలాంటి చర్చ లేకుండా ఈ మూడు క్రిమినల్ కోడ్ బిల్లులను పార్లమెంటులో ఆమోదించారు. ఈ చట్టాల సాధ్యతను అంచనా వేసే నిపుణుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి’’ అని తన పిటిషన్‌లో న్యాయవాది విశాల్ తివారీ ప్రస్తావించారు. కొత్త క్రిమినల్ చట్టాలు చాలా క్రూరమైనవని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల ప్రాథమిక హక్కుల ప్రతి నిబంధనను ఇవి ఉల్లంఘించాయని వాదించారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు బెంచ్ విభేదించింది.
Also Read :Raghuram Rajan : ‘‘భారత్ పేద దేశం కూడా’’.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
కీలక తేదీలు ఇవీ..
- భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత(Bharatiya Nyaya Sanhita), భారతీయ సాక్ష్య అధినియంలను గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదించింది.
- డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్టాలకు ఆమోద ముద్ర వేశారు.
- ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ చట్టాలు అమలులోకి వస్తాయని కేంద్ర సర్కారు వెల్లడించింది.