HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Farmers Should Not Be Disheartened Government Will Stand By Harish Rao

Harish Rao: రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: హరీశ్ రావు

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు.

  • Author : Balu J Date : 26-04-2023 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

రైతులు ధైర్యంగా ఉండాలి. రైతు నాయకుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు. రైతుల పక్షపాతి అయిన నాయకుడు కేసీఆర్ ఉన్నారు. కాబట్టి ఎవరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నోటికాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇప్పటికే వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి వెల్లడి. జిల్లాలోని సిద్ధిపేట అర్బన్ మండలం, దుబ్బాక, తొగుట మండలాల్లో రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానతో ఎంతో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలలో పర్యటిస్తూ.. రైతులను ఓదారుస్తున్న మంత్రి, జిల్లా అధికార బృందం.

భారత దేశంలో (India) ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా రూ.2, 3 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కాబట్టి రైతులను కాపాడుకోవాలని, రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఇప్పటికే రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. గ్రామాలలో నష్టపోయిన ఏ ఒక్కరైతు మిస్ కాకుండా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఫీల్డ్ లో పర్యటించి వివరాలన్నీ ప్రభుత్వానికి వెంటనే పంపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

వాస్తవానికి యాసంగిలో ఎంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి, ప్రయివేటు ఎక్చేంజ్ లో కొని రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసింది. కానీ దురదృష్టం రైతుబంధు ఇచ్చి, నాణ్యమైన కరెంటు ఇచ్చి నోటి కాడికి వచ్చిన బుక్క జారిపోయినట్లు ఈ ప్రకృతి వైపరీత్యం వడగండ్ల వాన రూపంలో చాలా నష్టం జరిగిందని తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోనే ఇప్పటికే 35 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు వివరాలు వచ్చాయి. నిన్నరాత్రి జరిగిన ప్రకృతి వైపరీత్యంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు సాయంత్రం వరకు తెలుస్తాయి.

ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఈ దరిమిలా అన్నీ జిల్లాలో గౌరవ మంత్రులు వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం పక్షాన రైతులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నది. రైతులు అధైర్యపడొద్దు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడుకుంటాం. డిసెంబరు నెలలో రైతులు వరినాట్లు వేసిన దరిమిలా శ్రీరామ నవమి పండుగలోపు చాలా చోట్ల పంట కోతలు పూర్తయ్యాయి. మనం భవిష్యత్తులో నెలముందే పంట కోత తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. వానా కాలం పంట ఒక నెల ముందు జరుపుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోకుండా ఉంటామని రైతులకు మంత్రి (Harish Rao) హితవు పలికారు.

Also Read: Fish Medicine: చేపమందు పంపిణీకి రంగం సిద్ధం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farmers
  • harish rao
  • siddipet
  • telangana

Related News

Telangana Liquor Prices hike

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె

  • Richest Ministers

    టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

  • Harish Rao

    Harish Rao: కేసీఆర్ ఆఫీసు మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

  • Telangana Cabinet

    త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

Latest News

  • AP Farmers : ఏపీ రైతులకు గొప్ప శుభవార్త..ఏకంగా రూ.50 వేల సబ్సిడీ పొందే ఛాన్స్ !!

  • YCP : వైసీపీకి అసలుసిసలైన అస్త్రం దొరికిందా ?

  • Pooja Hegde : పూజా హగ్దే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా ?

  • Curd : ఏంటి మీ ఇంట్లోని పెరుగు పుల్లగా ఉంటుందా..? అయితే ఈ చిన్న చిట్కా తో పులుపు అనేది ఉండదు !!

  • Pawan Kalyan : ఓటమికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా..ఏయూ వేదికగా పవన్ సంచలన వ్యాఖ్యలు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd