Telangana : ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు..? – బిఆర్ఎస్
ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ఎరువులు, విత్తనాల కోసం ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు వెళ్తే.. అక్కడ చాంతాడంత లైన్ దర్శనమిస్తోంది
- By Sudheer Published Date - 06:07 PM, Wed - 29 May 24

కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు..అప్పుడే కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రీ బస్సు , ఫ్రీ కరెంట్ , రూ.500 లకే గ్యాస్ ఇస్తున్నాం అంటూ చెపుతున్న కాంగ్రెస్..మిగతా వాటిని మాత్రం గాలికి వదిలేసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదు..ఇక ఇప్పుడు వర్షాలు పడే సమయం వచ్చింది..విత్తనాలు ఇస్తే మా పని మీము చేసుకుంటాం అంటే ఎక్కడ విత్తనాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ఎరువులు, విత్తనాల కోసం ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు వెళ్తే.. అక్కడ చాంతాడంత లైన్ దర్శనమిస్తోంది. దీంతో.. వేకువజామునే వచ్చి పడిగాపులు పడుతున్నారు. ఎండలో క్యూలో నిలబడలేక.. పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులను లైన్‌లో పెట్టి నీడ పట్టు చూసుకుంటున్నారు. ఇందుకోసం వేకువజామున వస్తే.. తిండీ తిప్పలు లేకుండా ఎండలో ఇబ్బంది పడాల్సి వస్తోందంటూ రైతులు చెప్తున్నారు. ఈ పరిస్థితిని చూసి.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. గత ఐదారు నెలల నుంచి రైతుల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. పోని పండిన పంటలను కూడా కొనేందుకు ప్రభుత్వం ముందుకురాలేదు. దాంతో అకాల వర్షాలకు పంట తడిసిపోయింది. చివరకు మిగిలిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనే దిక్కు లేదు. ఇక ఖరీఫ్ సీజన్‌లో వేసే పంటలకు సంబంధించిన విత్తనాల కోసం రైతులు సీడ్ షాప్సు ముందు బారులు తీరుతున్నారు. విత్తనాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు..? అని నిలదీశారు. వ్యవసాయ పరిస్థితులను పర్యవేక్షించాలని వ్యవసాయ మంత్రి ఎక్కడ..? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది..? అని నిలదీశారు కేటీఆర్. నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!! పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు?
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం దగ్గర ఉదయం 6 నుండే జిలుగు విత్తనాల కోసం పాసు బుక్కులతో రైతుల క్యూలైన్.
గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా రైతులను ఎండలో రోడ్లమీద నిలబెట్టి చోద్యం చూస్తున్న అసమర్థ కాంగ్రెస్ మంత్రులు.… pic.twitter.com/zNEkUtWVJj
— BRS TechCell (@BRSTechCell) May 29, 2024
Read Also : Telangana : కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం – బీజేపీ ఎంపీ లక్ష్మణ్