HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Mp Laxman Comments On Phone Tapping Case

Telangana : కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం – బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు

  • Author : Sudheer Date : 29-05-2024 - 5:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP MP Laxman reacted to the phone tapping incident
BJP MP Laxman reacted to the phone tapping incident

తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) కు సంబంధించి రోజు రోజుకు అనేక కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేసి వారి దగ్గరి నుండి వాగ్మూలం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారంతా కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో ఈ కేసు ఫై బిజెపి ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని… దేశద్రోహం వంటిదే అన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి రాజీపడ్డారని ఆరోపించారు. తానూ ట్యాపింగ్ బాధితుడే అయినప్పటికీ సీఎం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ విషయం అని.. ఈ విషయంలో అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హైకమండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా? అని అనుమానాలు వ్యక్తం చేసారు.

ఇక లోక్‌సభ ఎన్నికల్లో తాము సత్తా చాటబోతున్నామని.. డబుల్ డిజిట్ ఖాయమని జోస్యం చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలుగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also : Tragic Incident : బాపట్లలో సరదా ఈత..ప్రాణాలు పోయేలా చేసింది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP MP Laxman
  • CM Revanth Reddy
  • kcr
  • Phone Tapping Case

Related News

Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  ఈసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులు చేశారని అన్నారు. అప్పులపై కేసీఆర్, హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. సచివాలయంలో మీడియాతో మాట్లా

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd