Winter: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న హైదరాబాద్ జనాలు
చలి కారణంగా హైదరాబాద్ జనాలు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలికాలం మొదలైనట్టు అనిపిస్తోంది.
- By Balu J Published Date - 12:01 PM, Fri - 27 October 23

Winter: చలికాలం ప్రారంభమైంది. ఫలితంగా జనాలు వణికిపోతున్నారు. హైదరాబాద్‌లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 17.7 డిగ్రీల సెల్సియస్ (°C) నమోదైంది. ఉదయం చల్లటి గాలుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా భారత వాతావరణ విభాగం (IMD) వాతావరణ నిపుణుడు M. ముకంద రావు మాట్లాడుతూ.. “ఈశాన్య గాలులు ప్రబలంగా ఉన్నాయి. ఇది చలిని తెస్తుంది. గురువారం, ఉష్ణోగ్రత 17.7 ° ఉంది.
నవంబర్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని, ఆ తర్వాత క్రమంగా చలికాలంలోకి దారితీస్తుందని ఆయన అన్నారు. పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా దుప్పట్లతో రక్షణ పొందుతున్నారు సిటీ జనాలు. మార్నింగ్ జాగర్స్, నైట్ వాచ్‌మెన్, ట్రక్కర్లు మంటలు వేసుకొని వేడిని పొందుతున్నారు. ఈ ద్రుశ్యాలు ముందే బోగి పండుగ వచ్చినట్టు అనిపిస్తోంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దాదాపు 1,600 ఎకరాల విస్తీర్ణంలో నివసించే విద్యార్థులు చలి తీవ్రతతో బాధపడుతున్నారు. ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. మా నివాసం క్యాంపస్‌లోనే ఉండటంతో తెల్లవారుజామున చలిగాలులు వీస్తున్నాయని, నా దగ్గర్లోని బహిరంగ ప్రదేశాల్లో శీతాకాలపు (వలస) పక్షులు వస్తున్నాయని గత నాలుగు రోజులుగా చూశాం” అని చెప్పారు.
Also Read: Rajagopal Reddy: కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి, ఠాక్రే సమక్షంలో చేరిక!