HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Expansion Of Telangana Cabinet Soon A Chance For Those Four Congress Leaders

Telangana Cabinet : త్వరలోనే నాలుగు మంత్రి పదవుల భర్తీ.. పలువురికి నామినేటెడ్ పోస్టులు

ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిలో నాలుగు మాత్రమే ఇప్పుడు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

  • Author : Pasha Date : 13-08-2024 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Party
Congress Party

Telangana Cabinet : త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగేే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిలో నాలుగు మాత్రమే ఇప్పుడు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మిగతా రెండు మంత్రి పదవుల్లో ఒకదాన్ని మైనారిటీల కోసం, మరోదాన్ని పార్టీ ప్రాధాన్యమిచ్చే నాయకులకు కేటాయించేందుకు పక్కన పెడుతున్నట్లు సమాచారం. ఇక నాలుగు మంత్రి  పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి మంత్రి పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు, మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌ కూడా ఈ పోటీలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

మంత్రి పదవులు(Telangana Cabinet) ఆశించి భంగపడే ఎమ్మెల్యేలకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఆర్టీసీ, పౌర సరఫరాలు, మూసీ డెవలెప్‌మెంట్‌ అథారిటీ వంటివి వారికి కేటాయించి, ఆయా విభాగాలకు క్యాబినెట్‌ హోదా కల్పించే అవకాశం ఉంది. ఏఐసీసీ స్థాయిలో సీఎం రేవంత్ చర్చించిన తర్వాతే ఈ పదవుల భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకోగానే మంత్రి పదవుల భర్తీకి సంబంధించిన కసరత్తు వేగవంతం అవుతుందని తెలుస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి రేపు (బుధవారం) హైదరాబాద్‌‌కు చేరుకుంటారు. మరుసటి రోజు స్వాతంత్య్ర దినోత్సవాల్లో  పాల్గొంటారు. ఈ నెల 16న రాష్ట్ర పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ నెల 17న లేదంటే 18న ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో భేటీ అయి మంత్రి పదవుల కేటాయింపుపై చర్చించే అవకాశం ఉంది.

Also Read :Jogiramesh : మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశాలు కల్పించడంలో సామాజిక సమతుల్యతను పాటించేందుకు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు నాలుగు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవులను త్వరగానే భర్తీ చేయనున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎంపీ బలరాం నాయక్‌, సంపత్‌ కుమార్, మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్‌ గౌడ్‌ పోటీపడుతున్నారు. వీరిలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించే అవకాశం ఉందట. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని అంచనా వేస్తున్నారు.

Also Read :Donald Trump : నా శ్రమతోనే బైడెన్‌ను ఇంటికి పంపించా.. మస్క్‌తో ట్రంప్ సంచలన ఇంటర్వ్యూ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress leaders
  • telangana cabinet

Related News

    Latest News

    • IPL 2026: నేడు లక్నో vs రాజస్థాన్..గెలుపు ఎవర్ని వరిస్తుందో ?

    • RTC Strike : తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd