C Ramachandra Reddy : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సి. రామచంద్రారెడ్డి కన్నుమూత..
మాజీ మంత్రి, ఆదిలాబాద్(Adilabad) జిల్లాకు చెందిన కాంగ్రెస్(Congress) నేత సి. రామచంద్రారెడ్డి(C Ramachandra Reddy)కొద్దిసేపటి క్రితం నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో మరణించారు.
- By News Desk Published Date - 08:03 PM, Thu - 20 July 23

మాజీ మంత్రి, ఆదిలాబాద్(Adilabad) జిల్లాకు చెందిన కాంగ్రెస్(Congress) నేత సి. రామచంద్రారెడ్డి(C Ramachandra Reddy)కొద్దిసేపటి క్రితం నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో మరణించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన రామచంద్రా రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు.
మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. రామచంద్రారెడ్డి జీవిత కాలం ప్రజా సేవకు అంకితమయ్యారని, నిజాయిత, క్రమశిక్షణతో రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి రామచంద్రా రెడ్డి గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడి ఆయనకు నివాళులు అర్పించారు.
చిలుకూరి రామచంద్ర రెడ్డి 1978, 1985, 1989, 2004లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇందులో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా అనంతరం కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 2009, 2012లలో మాత్రం పోటీ చేసి ఓటమి పాలయ్యారు రామచంద్రా రెడ్డి. ఆయన మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కి తీరని లోటు.
Also Read : KTR: భారీ వర్షాల ఎఫెక్ట్.. రైతు నిరసన కార్యక్రమాలు వాయిదా!