KTR: భారీ వర్షాల ఎఫెక్ట్.. రైతు నిరసన కార్యక్రమాలు వాయిదా!
వర్షాల నేపథ్యంలో రైతు నిరసన కార్యక్రమాలు వారం పాటు వాయిదా వేయాలని బిఅర్ఎస్ నిర్ణయం తీసుకున్నది.
- By Balu J Published Date - 06:37 PM, Thu - 20 July 23

KTR: కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వారం పాటు వాయిదా వేయాలని బిఅర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఒక ప్రకటన విడుదల చేశారు.
వర్షాలు (Rains) తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరికీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మూడు గంటల ఉచిత విద్యుత్ విధానాన్ని ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కేటీఆర్ (KTR) కోరారు.
Also Read: Naga Chaitanya & Keerthy: కీర్తి సురేశ్ తో చైతూ రొమాన్స్.. అప్ డేట్ ఇదిగో!