HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ex Hmda Director Shiva Balakrishna Taken Into 8 Days Custody

Hyderabad: ఏసీబీ కస్టడీకి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈరోజు ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 31-01-2024 - 4:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shiva Balakrishna
Shiva Balakrishna

Hyderabad: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈరోజు ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు జైలులో శివ బాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కార్యాలయానికి తరలించారు

ఏసీబీ కోర్టు శివ బాలకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శివ బాలకృష్ణ ఎనిమిది రోజుల రిమాండ్ కు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణ పేరిట నాలుగు ఖాతాలు ఎస్‌బీఐ బ్యాంకులో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ బ్యాంకు లాకర్లను తెరిచే అవకాశం ఉంది.

కాగా ఐదు రోజుల క్రితం హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, ప్రస్తుత రెరా కార్యదర్శి శివ బాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో 24వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. మణికొండలోని ఆయన నివాసంతో పాటు అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.

2018-2023 మధ్య కాలంలో హెచ్‌ఎండీ ప్లానింగ్ విభాగంలో కీలక హోదాలో పనిచేసిన శివ బాలకృష్ణ. అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారన్న ఆరోపణలు, తాజాగా వారిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా తనిఖీల్లో భాగంగా పదికి పైగా ఐఫోన్లు, 50 అత్యంత ఖరీదైన వాచీలు, నగదు కట్టలు, 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూమి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Kinetic Luna electric: కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ డేట్ ఫిక్స్.. ధర పూర్తి వివరాలివే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 8 days
  • Custody
  • Ex-HMDA
  • hyderabad
  • Shiva Balakrishna

Related News

Phone Recharge suicide Live-in relationship Jeedimetla hyderabad

Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..

ప్రియుడు మొబైల్ ఫోన్‌కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్‌లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉండగా, అతను కిరణ్మయి తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో పని

  • Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

    HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

  • Srh Klassen

    IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • Rashmi Gautam: వైసీపీ లీడర్‌పై యాంకర్ రష్మీ సీరియస్..!! నేను ఎవరికీ భయపడను.

  • Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  • Hormuz Strait: ఇరాన్ పై ట్రంప్ దెబ్బ

  • Squirrel Attack: యూనివర్సిటీ మొత్తాన్ని పరుగెత్తించిన ఉడుత..

  • Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd