Congress Second List : కాంగ్రెస్ లిస్టుపై రేవంత్ ముద్ర.. సెకండ్ లిస్టుపై సస్పెన్స్ !
Congress Second List : కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఫస్ట్ లిస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపించింది.
- By Pasha Published Date - 02:18 PM, Sun - 15 October 23

Congress Second List : కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఫస్ట్ లిస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆయన మాట ఇచ్చిన వారిలో చాలామంది టికెట్లు దక్కాయి. ఈ లిస్టును చూస్తే.. మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), ఆయన కుమారుడు రోహిత్ (మెదక్) ముందు వరుసలో ఉంటారు. వీరిని కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో, టికెట్లు ఇప్పించడంలో రేవంత్ కీలకంగా వ్యవహరించారు. ఇక నకిరేకల్ అసెంబ్లీ టికెట్ ను పొందిన వేముల వీరేశం, కల్వకుర్తి టికెట్ పొందిన కసిరెడ్డి నారాయణరెడ్డిలకు రేవంత్ మొదటినుంచీ బాగా సపోర్ట్ ఇచ్చారు. వారి గురించి అధిష్టానానికి మంచి ఫీడ్ బ్యాక్ ను పంపారు. వీరే కాదు.. ఇవాళ టికెట్స్ పొందినవారిలో మరో డజను మందికి స్క్రీనింగ్ కమిటీ, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ద్వారా టికెట్ ఖరారు చేయించడంలో రేవంత్ ముఖ్య పాత్ర పోషించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టుపై అంతటా ఉత్కంఠ నెలకొంది. వామపక్షాలతో పొత్తులపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీకి వచ్చాక.. ఆ లిస్టును కూడా రిలీజ్ చేసేందుకు హస్తం పార్టీ అవుతోంది. మొదటి నుంచి సీపీఎం అడుగుతూ వచ్చిన భద్రాచలం టికెట్ కాంగ్రెస్ నేత పొదెం వీరయ్యకు దక్కింది. సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లను కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతోపాటు మునుగోడు టికెట్ ను సీపీఐ, మిర్యాలగూడ, పాలేరు టికెట్లను సీపీఎం ఆశిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఒకవేళ హస్తం పార్టీ నై అంటే వామపక్షాలు ఏం చేస్తాయి ? (Congress Second List) అనేది వేచిచూడాలి.