BRS B-Forms : బీఆర్ఎస్ లో బీ-ఫామ్స్ టెన్షన్.. అందుకున్న అభ్యర్థులు వీరే..
BRS B-Forms : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ వేదికగా 51 మంది పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్ లను అందజేశారు.
- By Pasha Published Date - 01:57 PM, Sun - 15 October 23
BRS B-Forms : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ వేదికగా 51 మంది పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్ లను అందజేశారు. అయితే మిగతా వారికి ఇవ్వాల్సిన బీ-ఫామ్ లు ఇంకా రెడీ కాలేదని వెల్లడించారు. దీంతో మిగతా అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. తమకు బీ-ఫామ్స్ చివరి నిమిషంలో ఇవ్వకుంటే పరిస్థితేంటి అని పలువురు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రెండు డజన్ల అసెంబ్లీ స్థానాల్లో చివరి నిమిషంలో మార్పులు జరుగుతాయంటూ ఇంతకుముందు వెలువడిన ఊహాగానాలకు ఊతం ఇచ్చేలా కేసీఆర్ కొంతమందికే బీ-ఫామ్ లను ఇవ్వడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై పూర్తి క్లారిటీకి వచ్చిన తర్వాత.. నియోజకవర్గాల్లోని బలాబలాలపై లెక్కలు వేసుకొని రెండు, మూడు రోజుల్లోగా మిగతా అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్ లను అందజేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీ-ఫామ్ లు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..
పల్లా రాజేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అంజయ్య యాదవ్, లింగాల కమల్ రాజ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, హన్మంత్ షిండే, పువ్వాడ అజయ్, మదన్‌లాల్, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, గూడెం మహిపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, అంజయ్య యాదవ్, బీరం హర్షవర్దన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, భూపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్, కృష్ణమోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, షకీల్, బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, జాజాల సురేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, జాన్సన్ నాయక్, అనిల్ జాదవ్, విఠల్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ నుంచి బీఫామ్ లను అందుకున్నారు. వీరికి బీఫామ్ తో పాటు సీఎం కేసీఆర్ రూ.40 లక్షల చెక్కును అందజేశారు. ఇక సీఎం కేసీఆర్ తరఫున కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన బీఫామ్‌ను గంప గోవర్దన్ అందుకున్నారు. మాతృవియోగం కారణంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న వేముల ప్రశాంత్‌రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కవిత బీఫామ్ (BRS B-Forms) తీసుకున్నారు.జనగామ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ భవన్లో కేసీఆర్‌ను కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు.
Related News
Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.