HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Enough Of Bashanbaazi Where Is Progress Kcr To Modi

KCR On Modi: గొప్పల డప్పు కొట్టుకోవడం ఆపండి.. అభివృద్ధి సంగతేందో చెప్పండి: మోడీపై కేసీఆర్ మాటల వార్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు.

  • Author : Hashtag U Date : 26-05-2022 - 10:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM KCR Deve Gowda
CM KCR Deve Gowda

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. ” మాటకారి తనంతో గొప్పల డప్పులు కొట్టుకోవడం ఆపి.. దేశంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మోదీ చెప్పాలి” అని కేసీఆర్ ప్రశ్నించారు. 2014లో కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం వల్ల జనం బతుకులు భారంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని స్థాయిలో రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయిందని కేసీఆర్ చెప్పారు. గురువారం ఉదయమే కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లిన కేసీఆర్, మాజీ ప్రధానమంత్రి దేవె గౌడ , దేవె గౌడ కుమారుడు కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా జాతీయ రాజకీయాలు, 2024 ఎన్నికల సమీకరణాలపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం కేసీఆర్.. అది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా..

భారత్ తో పాటే స్వాతంత్ర్యం సాధించిన ఎన్నో దేశాలు అభివృద్ధి పథంలో చాలా ముందుకు దూసుకుపోయాయని కేసీఆర్ చెప్పారు. స్వాతంత్ర్య భారతదేశాన్ని సాధించుకొని 75 ఏళ్ళు గడిచినా.. ఇప్పటికీ పేదలు, దళితులు, రైతులు, ఆదివాసీల ముఖాల్లో చిరునవ్వులు చిందే పరిస్థితులు లేవని తెలిపారు. ఎవరు మాత్రం సంతోషంగా ఉన్నారు చెప్పండి ? అని కేసీఆర్ ప్రశ్నించారు. మరోవైపు ప్రధానమంత్రి మోడీ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటన కు వచ్చారు. ఈ సమయానికి కొన్ని గంటల ముందే కేసీఆర్.. దేవెగౌడ ను కలిసేందుకు బెంగళూరుకు వెళ్లారు. గత 4 నెలల్లో మోడీ 2 సార్లు హైదరాబాద్ కు వచ్చారు. ఈ రెండుసార్లు కూడా మోడీ హైదరాబాద్ కు రాగా, కేసీఆర్ ఇతర రాష్ట్రాల కు వెళ్లారు. తెలంగాణ లో టీఆర్ఎస్ కు సవాల్ విసిరేందుకు సిద్ధం అవుతున్న బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు లక్ష్యంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

CM Sri KCR addressed the media after meeting with former PM Sri @H_D_Devegowda and former CM Sri @hd_kumaraswamy in Bangalore. pic.twitter.com/lNJVAYyrS4

— BRS Party (@BRSparty) May 26, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • pm modi
  • telangana politics
  • TRS vs BJP

Related News

Jagan Allegations PM Modi

ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్‌ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.

  • PM Modi

    11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Oman

    ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

Latest News

  • బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

  • చైనా సాయం కోరిన భార‌త్‌.. ఏ విష‌యంలో అంటే?

  • అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!

  • దట్టమైన పొగమంచులో వాహనం నడుపుతున్నారా?

  • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd