Hyderabad : విద్యుత్ బకాయిలు చెల్లించ మన్నందుకు లైన్ ఇన్‌స్పెక్టర్ దాడి
రాములు అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లిన పెండింగ్ విద్యుత్ బిల్లు చెల్లించాలని అడిగాడు
- By Sudheer Published Date - 06:38 PM, Fri - 19 July 24

తెలంగాణ (Telangana) లో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయి. బకాయిలు చెల్లించమన్న..పెండింగ్ బిల్లులు కట్టమన్న…బస్సులో ఫుల్ రాష్ కారణంగా స్టేజ్ వద్ద బస్సు ఆపకపోయిన దాడులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad ) లోని సనత్ నగర్ (Sanathnagar) లో విద్యుత్ బకాయిలు చెల్లించ మన్నందుకు లైన్ ఇన్‌స్పెక్టర్ (Electricity employee attacked) ఫై ఓ యువకుడు దాడి చేసిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ లో ఫ్రీ కరెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సాంకేతిక సమస్యలు కారణంగా రేషన్ కార్డు ఉన్నప్పటికీ కొంతమందికి బిల్లు వస్తుంది. వీటిని ప్రభుత్వం సరిచేస్తాం అని చెపుతుంది కానీ చేయడం లేదు. దీంతో చాలామంది కరెంట్ బిల్లులు కట్టకుండా ఉంటున్నారు. దీంతో నెలనెల కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. ఈ తరుణంలో బిల్లులు కట్టని వారి ఇంటికి వెళ్లి కరెంట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కరెంట్ బిల్లులు కట్టాలని, లేని పక్షంలో కరెంట్ కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సనత్ నగర్ లో లైన్ ఇన్‌స్పెక్టర్ సాయిగణేష్ రోజూ లాగానే ఆ ప్రాంతంలో విద్యుత్ బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లాడు. రాములు అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లిన పెండింగ్ విద్యుత్ బిల్లు చెల్లించాలని అడిగాడు. అయితే, ఇంటి యజమాని అందుకు నిరాకరించగా.. కరెంట్ కనెక్షన్ కట్ చేశారు.
దీంతో కోపంతో ఊగిపోయిన ఇంటి యజమాని కొడుకు మురళీధర్ రావు (19).. లైన్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసాడు. స్థానికులు చూస్తుండగానే దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంతలో అక్కడకు వచ్చిన స్థానికులు యువకున్ని అడ్డుకున్నారు. అయినా, వెనక్కు తగ్గని సదరు యువకుడు లైన్ ఇన్‌స్పెక్టర్, అతనితో వచ్చిన సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యువకుని దాడిలో లైన్ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై బాధితుడు సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఫై విద్యుత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి సరికాదని.. దీనిపై విచారణ చేపడతామని అన్నారు.
Read Also : Jagan : మాజీ సీఎంకు తుప్పుపట్టిన కారు ఇస్తారా..? అంబటి వ్యాఖ్యలకు ప్రభుత్వం క్లారిటీ