Elections Schedule Today : ఇవాళ మధ్యాహ్నమే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
Elections Schedule Today : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేయనుంది.
- By Pasha Published Date - 08:31 AM, Mon - 9 October 23

Elections Schedule Today : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేయనుంది. ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ రాష్ట్రాల్లో నవంబర్ రెండోవారం నుంచి డిసెంబర్ రెండోవారంలోగా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. మావోయిస్టుల టెన్షన్ ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 2వ వారం చివర్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి.
We’re now on WhatsApp. Click to Join
జమిలి ఎన్నికలకు ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి… ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికల ముందు ట్రైలర్ లాగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయచ్చని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఉండగా.. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ అధికార, విపక్షాల మధ్య పోటీ హైరేంజ్‌లో ఉంది. అందుకే ఈ ఎన్నికలు (Elections Schedule Today) హాట్ హాట్ గా మారాయి.