Ek Police System : 39 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్..
Ek Police System : రాష్ట్రవ్యాప్తంగా పలు బెటాలియన్ లకు చెందిన కానిస్టేబుల్స్ , కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ వారి పైన వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 01:05 PM, Sun - 27 October 24

తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఆందోళనలు ఉధృతం అవుతున్న వేళ తెలంగాణ పోలీస్ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు బెటాలియన్ లకు చెందిన కానిస్టేబుల్స్ , కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ వారి పైన వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 39 మందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు కమాండెంట్ ఆఫీసు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు.
బెటాలియన్ ఎదుట హైవేపై ధర్నాకు ప్రయత్నించినప్పుడు, సివిల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలాగే మంచిర్యాలలో పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు కూడా నిరసనలు నిర్వహించారు. చిన్న పిల్లలతో కలిసి ఐబీ చౌరస్తాలో బైఠాయించి, ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, బెటాలియన్ పోలీసుల భార్యలు పాల కేంద్రం నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ భర్తలు కూలి పనులు, వంట పనులు చేయిస్తున్నారని, సివిల్ పోలీసులతో 8 గంటల ఉద్యోగం విధానం అనుసరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ దీనిపై సీరియస్ అవుతూ.. మొత్తం 39 మందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత..