Viral : “ఈ మహా నగరానికి ఏమైంది..?” – కేటీఆర్ ట్వీట్
ఈ తెలంగాణ లో ఏంజరుగుతుంది..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? హామీలు ఏమయ్యాయి అడిగినవారిపై దాడులు , పోలీసులు కేసులు..ఇలాంటి గొంతుకోసే పార్టీ కి చరమగీతం పాడాలి
- By Sudheer Published Date - 06:10 PM, Thu - 11 July 24

ఈ నగరానికి ఏమైంది..? (Ee Nagaraniki Emaindi) ఓ వైపు నుసి మరోవైపు పొగ… ఎవ్వరూ నోరు మెదపరేంటి..? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి.? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం అని సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది..కానీ ఇప్పుడు మరో విధంగా నగర వాసులు మాట్లాడుకుంటున్నారు. ఈ తెలంగాణ లో ఏంజరుగుతుంది..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? హామీలు ఏమయ్యాయి అడిగినవారిపై దాడులు , పోలీసులు కేసులు..ఇలాంటి గొంతుకోసే పార్టీ కి చరమగీతం పాడాలి అంటూ చాలామంది అంటున్నారు. ఇదే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ (KTR) తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
అసెంబ్లీ ఎన్నికల్లో , లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ మళ్లీ ప్రజల మనసులు గెలిచేందుకు నడుం బిగించింది. ఓ పక్క గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పార్టీని వీడుతున్న ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా అధికార పార్టీ మోసాలను ప్రజల ముందు ఉంచుతూ..ప్రజలు తరుపున పోరాటం చేస్తూ మద్దతు పలుకుతుంది. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో ఉద్యమాలు మళ్లీ మొదలయ్యాయి. గ్రూప్-2, DSC పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి తెలంగాణ ఉద్యమం నాటి పాత రోజులను గుర్తుకుతెస్తోంది. నిరుద్యోగుల ఆందోళనలను పరిష్కరించి ప్రభుత్వం యువతలో శాంతిని నింపుతుందా? లేక పంతానికి పోతే ఈ ఉద్యమాలు మరింత ఉద్ధృతంగా మారుతాయా? అని అంత మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక బిఆర్ఎస్ మాజీ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న వాటిని, వార్తా కథనాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మహానగరానికి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని… హత్యలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ సర్కార్‌పై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థమని వివరించారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. “బ్రాండ్ హైదరాబాద్” ఎందుకు మసకబారుతోంది ?? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ.. ఎందుకింత కళ కోల్పోతోంది ?? అని సగటు హైదరాబాదీకి అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ను ప్రేమించే ప్రతిఒక్కరిలో ఇదే ఆవేదన ఉందని చెప్పుకొచ్చారు.
“ఈ మహా నగరానికి ఏమైంది..?”
ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?” అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం!
పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా… pic.twitter.com/RF7aVlR7x6
— KTR (@KTRBRS) July 11, 2024
Read Also : Kodali Nani : జగన్ సూచనతో తన ఆలోచన మార్చుకున్న కొడాలి నాని