HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Drug Party At Farmhouse Duvvada Madhuri Srinivas Arrested

Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?

Farmhouse Liquor Party: మొయినాబాద్‌లోని 'ది పెండెంట్' ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ పెద్ద కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

  • Author : Sudheer Date : 12-12-2025 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Duvvada Arrest
Duvvada Arrest

హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు పార్టీ కల్చర్‌కు వేదికగా మారుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు, సరైన అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా పార్టీలు నిర్వహించడం సాధారణమైపోయింది. ఈ ట్రెండ్‌కు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్రమ పార్టీలను భగ్నం చేస్తున్నారు. తాజాగా మొయినాబాద్‌లోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ పెద్ద కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పార్టీని నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.

రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు అందిన సమాచారం మేరకు.. గురువారం రాత్రి ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతి లేకుండా అక్రమంగా వినియోగిస్తున్న మద్యం బాటిళ్లతో పాటు హుక్కాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పార్టీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో కలిపి మొత్తం 29 మంది ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యం పార్టీ నిర్వహించినందుకు గాను పోలీసులు 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో పెరుగుతున్న అక్రమ పార్టీల నిర్వహణపై పోలీసులు పటిష్ట నిఘా ఉంచారనేందుకు ఈ రైడ్ నిదర్శనం.

Mahesh in Varanasi : వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!

ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ నిర్వహణకు అనుమతులు లేకపోవడంతో, పోలీసులు ఎక్సైజ్ చట్టంలోని 223 మరియు 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ పార్టీని నిర్వహించిన పార్థసారథి మరియు ఫామ్‌హౌస్ యజమాని సుభాష్‌లపై ప్రధానంగా కేసులు నమోదు చేశారు. రాజకీయ నాయకులు భాగస్వాములైన ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకులు ఎవరు, ఈ పార్టీ వెనుక మరేదైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఈ ఘటన ద్వారా పోలీసులు స్పష్టం చేశారు.

అయితే ఫామ్ హౌస్ పార్టీకి తమకు సంబంధం లేదని MLC దువ్వాడ శ్రీను, మాధురి తెలిపారు. ‘మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు పిలిస్తే అక్కడికి వెళ్లాం. బిజినెస్ మీట్ పెడుతున్నాం రమ్మని అడిగారు. అక్కడ విదేశీ మద్యం, హుక్కా ఉందని మాకు తెలియదు’ అని శ్రీను మీడియాకు చెప్పారు. ‘నాకు హుక్కా అంటే ఏంటో కూడా తెలియదు. పోలీసులు చెప్పాకే ఆ పార్టీకి పర్మిషన్ లేదని తెలిసింది. నేను అరెస్ట్ కాలేదు. ఇంట్లోనే ఉన్నా’ అని మాధురి వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Duvvada madhuri arrest
  • Duvvada Srinivas
  • duvvada srinivas arrest
  • Farmhouse Liquor Party
  • hyderabad
  • Moinabad Farm House

Related News

World Ivf Day

IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి గాంధీ ఆస్పత్రి మరోసారి నిదర్శనంగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్‌లో ఉచితంగా చికిత్స పొందిన భువనగిరి జిల్లాకు చెందిన ఓ మ‌హిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. రవి, సౌమ్య దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd