Railways: హారతులిచ్చే అయ్యప్ప స్వాములకు జైలు శిక్ష
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ కొల్లాం మధ్యలో నడుస్తాయని రైల్వే శాఖ సీపీఆర్వో తెలిపారు.అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే భక్తులకు పలు ప్రత్యేక సూచనలు చేసింది.
- By Siddartha Kallepelly Published Date - 01:10 PM, Sat - 18 December 21

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ కొల్లాం మధ్యలో నడుస్తాయని రైల్వే శాఖ సీపీఆర్వో తెలిపారు.అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే భక్తులకు పలు ప్రత్యేక సూచనలు చేసింది. స్పెషల్ ట్రెయిన్స్ లో ప్రయాణం చేసేవాళ్ళు పూజవస్తువులైన కర్పూరం, అగరబత్తీలు వెలగించవద్దని, హారతి ఇవ్వొద్దని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్లలో మండే స్వభావం ఉండే వస్తువులను అస్సలు తీసుకెళ్లవద్దంటూ హెచ్చరించింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రత్యేకంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ సూచనలను కచ్చితంగా గుర్తించుకోవాలని అధికారులు సూచించారు. అందరి భద్రతా దృష్ట్యా ఈ నిబంధనల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు ప్రకటించింది.