HCU : జింకపై దాడి చేసిన కుక్కలు..జంతు ప్రేమికుల ఆవేదన
HCU : హెచ్‌సీయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ ప్రాంతానికి చేరుకున్న ఓ జింకపై వీధి కుక్కలు దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడింది
- By Sudheer Published Date - 03:42 PM, Fri - 4 April 25

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసరాల్లో ఓ జింక(Deer)పై వీధి కుక్కలు దాడి (Dogs Attck) చేసి గాయపరిచిన ఘటన జంతు ప్రేమికుల ఆవేదనకు గురి చేస్తుంది. కంచ గచ్చిబౌలిలో ఇటీవల 100 ఎకరాల పచ్చని చెట్లను నరికి వేసిన ప్రభుత్వం చర్యల వల్ల అడవి జంతువులు ఆశ్రయం కోల్పోయాయి. దీంతో వందలాది జింకలు, వేలాది నెమళ్లకు ఆవాసాలు లేకుండా పోవడంతో అవి జనావాసాల్లోకి చేరుతున్నాయి. తాజాగా హెచ్‌సీయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ ప్రాంతానికి చేరుకున్న ఓ జింకపై వీధి కుక్కలు దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడింది. విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి జింకను వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.
Neet Row : డీఎంకే సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన హరితవనాల తొలగింపు చర్యలపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల్లోనే 100 ఎకరాల అడవిని నరికి వేయడం వల్ల ప్రకృతి సంతులనం దెబ్బతింది. వన్యప్రాణులు జనావాసాల వైపు రావడం, నీళ్ల కోసం ప్రజల వద్దకి రావడం, వీధికుక్కల దాడులకు బలవడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రకృతి మరియు జీవసృష్టిపై తీవ్ర ప్రభావం చూపుతోందని విమర్శిస్తున్నారు.
First Bird Flu Death In AP: ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం..
ఇంకా ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి పాలనలో మూగజీవాలు కూడా బలయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఆయన చేసిన పాపాలకు ప్రకృతి కూడా క్షమించదని మండిపడ్డారు. హైడ్రా ప్రాజెక్టు పేరుతో పేదల భూములు తీసుకుని జీవవైవిధ్యాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రుణ మాఫీ పేరుతో రైతులను మోసగించి, రైతుబంధు నిధులు నిలిపివేశారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన చర్యలను సమీక్షించి, మూగజీవాల రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
Deforestation కారణంగా HCU సౌత్ క్యాంపస్ లో రోడ్డుపైకి వచ్చిన జింకను కుక్కలు వెంబడించి గాయపరచడం జరిగింది
ఈ గాయపడిన జింకకి తగిన చికిత్స అందించి క్షేమంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి తరలించాలని విజ్ఞప్తి 🙏#SaveHCUBioDiversity pic.twitter.com/s4nPRz5rOa— 🪷🪷హైందవి రెడ్డి 🪷🪷BJP Parivar (@HyndaviPandem) April 4, 2025