Congress Vs KTR : అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టావా కేటీఆర్.. కాంగ్రెస్ సంచలన ట్వీట్
Congress Vs KTR : బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన ట్వీట్ చేసింది.
- Author : Pasha
Date : 01-05-2024 - 12:29 IST
Published By : Hashtagu Telugu Desk
Congress Vs KTR : బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ నాయకులు అడ్డదారిన రాష్ట్రంలో అధికారాన్ని పొందడం కోసం బీజేపీతో జత కట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడింది. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనే బీజేపీ చెంతన చేరి బీఆర్ఎస్ దేశానికి ద్రోహం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసులు ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(Congress Vs KTR) ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేటీఆర్ అధికారం పోయినా నీ తలపొగరు తగ్గలేదు.
జన్వాడ ఫాం హౌస్ లో అబద్దాల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టినవ? లేక మతి పోయిందా?
స్వయంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి వచ్చి పార్టీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే తెలంగాణ… https://t.co/uweK4Z1AwO pic.twitter.com/TenURvq5ru
— Telangana Congress (@INCTelangana) May 1, 2024
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల తరఫున ప్రశ్నిస్తుంటే.. తెలంగాణ అంతా ఏకమై ఆయనకు మద్దతు తెలుపుతుంటే.. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులంతా బీజేపీతో చెయ్యి కలిపి మాట్లాడుతున్నారని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసైనా బుద్ధి మార్చుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండేదని తెలిపింది. రేవంత్ రెడ్డి లాంటి ప్రజా నాయకుడిపై చిల్లర ఆరోపణలు, అబద్ధాలు చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చెప్పింది. లోక్ సభ ఎన్నికల తర్వాత కారును బీజేపీకి తూకానికి అమ్ముకోవాల్సిందేనని కామెంట్ చేసింది. ‘‘కేటీఆర్ .. అధికారం పోయినా నీ తలపొగరు తగ్గలేదు. జన్వాడ ఫాం హౌస్‌లో అబద్దాల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టినవ? లేక మతి పోయిందా?’’ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రశ్నించింది.