KCR Delhi: కేసీఆర్ పై మమత ఎఫెక్ట్
కేసీఆర్ ఢిల్లీ టూర్ పై మమత ప్రభావం పడింది. ఇద్దరి షెడ్యుల్ ఒకటే కావడంతో కేసీఆర్ కు మోడీ అపాయింట్మెంట్ కుదరలేదట.
- By Hashtag U Published Date - 10:30 PM, Thu - 25 November 21

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై మమత ప్రభావం పడింది. ఇద్దరి షెడ్యుల్ ఒకటే కావడంతో కేసీఆర్ కు మోడీ అపాయింట్మెంట్ కుదరలేదట. అవమానం తో కేసీఆర్ తిరుగు మొఖం పట్టడం తెలంగాణ బీజేపీ సంతోష పడుతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన తనకి చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. వరిధాన్యం విషయంలో కేంద్రంతో తేల్చుకొని వస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కనీసం కేంద్ర మంత్రులను కూడా కలవలేకపోయారు.
Also Read: స్పీకర్ పోచారంకు కరోనా.. మనువరాలి పెళ్లిలోనే సోకిందా..?
యాసంగిలో ధాన్యం సేకరణ, నదీజలాల అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి కేసీఆర్ హస్తినకు వెళ్లారు. వరిధాన్యం విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, వ్యవసాయమంత్రులతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కనీసం ఎవరిని కలవకుండానే తెలంగాణకు వచ్చేసారు. ఈపర్యటనలో ప్రధాని మోదీని కలిసేందుకు పలుమార్లు తెలంగాణ సీఎం కార్యాలయం నుండి అనుమతి కోరినా లభించలేదని సమాచారం.
బెంగాల్ సీఎం మమతా భేటీ ఉండటంతో కేసీఆర్‌కి అవకాశం లభించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Also Read: దేశంలోనే తెలంగాణ బెస్ట్.. ఆ రంగాల్లో ఏపీ వెనుకడుగే!
కేసీఆర్ కు ప్రధాని అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడం రెండు పార్టీలకు కలిసివచ్చిందనే చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ కేసీఆర్ కలిసినప్పుడల్లా ఏం చర్చించారో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు ఇబ్బంది పడ్డారు. దానితో పాటు కేసిఆర్ కి ఈజీగా అప్పాయింట్మెంట్ దొరకడంతో ఈ రెండు పార్టీలు ఒకటేననే అభిప్రాయం కూడా వ్యక్తమయ్యేది. తాజాగా కేసీఆర్ కి పీఎం అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్ పై పైచేయి. సాదించినట్లుగా భావిస్తున్నారు. రైతుల కోసం మాట్లాడుదామంటే ప్రధాని మోదీ సమయమే ఇవ్వట్లేదని టీఆర్ఎస్ నేతలు కూడా ఆ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రైతుల సమస్య ఎప్పుడు తీరుతుందో, వారి అనుమానాలు ఎప్పుడు నివృత్తి అవుతాయో మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.
As KCR returned to Telangana after a 4 day stay in Delhi without a meeting with PM Mod,it set off spec that he was being snubbed.When asked, govt sources said that wasn’t the case-“he last asked for an appt on Sept 1 & got the appt on 3rd sep. There hasn’t been a request since”
— Nistula Hebbar (@nistula) November 25, 2021
Related News

PM Modi: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం : ప్రధాని మోదీ
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.