HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Delhi Liquor Scam Case Brs Mlc Kavitha Judicial Custody Extended Till May 20

MLC Kavitha : మే 20 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది.

  • Author : Pasha Date : 14-05-2024 - 2:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Judgment on Kavitha bail petition postponed once again

MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున కవిత రిమాండ్‌ గడువును పొడిగించాలని ఇవాళ విచారణ సందర్భంగా కోర్టును ఈడీ అధికారులు కోరారు. ఈ కేసులో ఇప్పటికే తాము 8వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేశామని, దానిపై విచారణ జరగాల్సి ఉందన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈడీ విజ్ఞప్తి మేరకు కవిత (MLC Kavitha)  జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఈనెల 20న సప్లిమెంటరీ ఛార్జిషీట్‌‌పై నిర్వహిస్తామని కోర్టు తెలిపింది. వాస్తవానికి ఈరోజుతో కవిత జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగిసింది.  దీంతో ఇవాళ ఉదయం విచారణ కోసం కవితను తిహార్ జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తుల ఎదుట  హాజరుపరిచారు.

Also Read :Modi Nomination: మోడీ నామినేషన్ సమయంలో ఉన్న ఆ నలుగురు ఎవరు ?

ఈడీ తాజాగా కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రముఖుల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఛన్‌ప్రీత్‌ సింగ్‌, దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అర్వింద్‌‌ సింగ్‌ పాత్రను ఇందులో ప్రస్తావించినట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరని లాయర్లు వాదించినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మహిళగా పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత కవితకు  ఉందని ఆమె తరఫు లాయర్లు వాదించినా ఫలితం లేకుండాపోయింది. ఎందుకంటే.. కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈడీ వాదించింది. అందుకే కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల నిరాకరించింది.

Also Read : RCB captain: ఆర్సీబీ కెప్టెన్ మారబోతున్నాడా..? హర్భజన్ కామెంట్స్ వైరల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Delhi liquor scam case
  • judicial custody
  • MLC Kavitha

Related News

Kcr Nandinagar

Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. 'జై తెలంగాణ.. జై కేసీఆర్' నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి

    Latest News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • షెకావత్ ను దింపుతున్న అనిల్ రావిపూడి ?

    • ఇక యాటిట్యూడ్ స్టార్ పని అయిపోయినట్లే..ఎందుకంటే అసలైన లేడీ టైగర్ దిగింది !!

    • అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైన‌ల్‌.. భార‌త్ భారీ స్కోర్‌!

    • సొంత పార్టీ నేతలకు సీఎం రేవంత్ క్లాస్ ?

    Trending News

      • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

      • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

      • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

      • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

      • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd