Delhi Liquor Policy Scam: కవితకు షాక్.. ఏప్రిల్ 23 వరకు జైలులోనే
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. .సీబీఐ కేసులో కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.
- Author : Praveen Aluthuru
Date : 15-04-2024 - 11:09 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Liquor Policy Scam: ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. .సీబీఐ కేసులో ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అయితే సీబీఐ కోర్టును 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరింది. ఈ మేరకు సీబీఐ వాదనను పరిశీలించిన కోర్టు కవితను ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతినిచ్చింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తూ కవితను అరెస్ట్ చేసింది. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కవిత కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 12న కవితను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం గత శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. దీంతో కోర్టు కవితను ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీకి పంపింది. గతంలో న్యాయమూర్తి మంజూరు చేసిన మూడు రోజుల పోలీసు కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ నిందితురాలిని కోర్టు ముందు హాజరుపరిచింది.
We’re now on WhatsApp. Click to Join
లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలకమైన వ్యక్తిగా సీబీఐ ఆరోపించింది. విచారణలో భాగంగా ఆమె కీలకమైన సమాచారాన్ని దాచిపెడుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది. 46 ఏళ్ల కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీలోని కోర్టులో హాజరు పరుచగా వాదనలు విన్న కోర్టు కవితను తీహార్ జైలుకు పంపించింది.
Also Read: Controversy : నిద్రరాకుంటే.. ఎక్స్‌ట్రా పెగ్ వేసుకోవాలి.. మహిళా మంత్రిపై బీజేపీ నేత వ్యాఖ్యలు