LIC Jobs : ఎల్‌ఐసీలో 200 జాబ్స్.. ఏపీ, తెలంగాణలోనూ పోస్టులు
200 జాబ్స్ భర్తీకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- By Pasha Published Date - 01:20 PM, Tue - 30 July 24

LIC Jobs : 200 జాబ్స్ భర్తీకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే వారు ఎల్‌ఐసీకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. మొత్తం 200 ఉద్యోగాల్లో 31 పోస్టులు తెలంగాణలో, 12 పోస్టులు(LIC Jobs) ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వారు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
Also Read :WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై డబుల్ ట్యాప్ ఫీచర్?
21 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ఫీజుగా రూ.800 + జీఎస్టీ చెల్లించాలి. https://www.lichousing.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ సమర్పించాలి. జూనియర్ అసిస్టెంట్లకు(Junior Assistant Posts) నెలకు రూ.32,000 నుంచి రూ.35,200 వరకు శాలరీ ఇస్తారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 25న ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు అప్లికేషన్లు సమర్పించవచ్చు. పరీక్షను ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయ్యే వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, అర్హులను ఉద్యోగాల్లో నియమిస్తారు.
పరీక్షా విధానం..
- అభ్యర్థులకు 200 మార్కులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దీన్ని 120 నిమిషాల్లో రాయాలి.
- లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి.
- ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు.
Also Read :Nani : నాని సినిమా రెమ్యునరేషన్ వల్లే ఆగిపోయిందా..?
ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్..
- 7,951 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- వీటిలో 7,934 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మరో 17 కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ పోస్టులు ఉన్నాయి.
- ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి.