Dasoju Sravan: కర్ణాటక నేతలకు తెలంగాణ లో ఏం పని? దాసోజు శ్రవణ్
కర్ణాటక నేతలు గద్దల్లాగా వచ్చి పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
- By Balu J Published Date - 05:04 PM, Sat - 2 December 23

Dasoju Sravan: బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఇవాళ హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలను తెలియజేశారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ చాలా తప్పు అని ఆయన అన్నారు. ముమ్మాటికీ 70 సీట్ల కు పైగా బీఆర్ఎస్ గెలువబోతుందని, మూడోవ సారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలతో కెసిఆర్ ది పేగు బంధమని, ఎగ్జిట్ పోల్ కు exact పోల్స్ కు మధ్య చాల తేడా ఉంటది అని, కెసిఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన అన్నాడు. కాంగ్రెస్ నేతలు లేఖి తనం చూపిస్తున్నారని, చిల్లర ప్రచారం చేస్తున్నారని, అధికారం లేకుండానే ఇంత లేఖి తనం చూపిస్తున్నారని దాసోజు మండిపడ్డారు. సంప్రదాయాలు తెలియ కుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని, కర్ణాటక నేతలకు తెలంగాణ లో ఏం పని ?, కర్ణాటక నేతలు గద్దల్లాగా వచ్చి పడుతున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
Also Read: Telangana: తెలంగాణకు ఆ రెండు రోజులు ఎల్లో అలర్ట్