Dasoju Sravan: రేవంత్ రెడ్డి మరో నయీమ్ లా మారిండు, టీపీసీసీ చీఫ్ పై దాసోజు ఫైర్!
బీఆర్ఎస్ లీడర్ దాసోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
- By Balu J Published Date - 11:15 AM, Sat - 15 July 23

హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ కు గత అర్ధరాత్రి రేవంత్ రెడ్డి అనుచరులం అంటూ కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రవణ్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ బెదిరింపుల ఫై శ్రవణ్ మీడియా తో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత దిగజారుడుతనానికి పాల్పడుతున్నావు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి భాష వినడానికి కూడా బాధకలుగుతుంది. ఎవర్ని బడితే వాళ్ళను ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. నేను ఏమన్నా..నువ్వు ఏమాట్లాడుతున్నావు అని రేవంత్ రెడ్డి ని శ్రవణ్ ప్రశ్నించారు.
నీకు బుద్ధిలేదా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. బీసీ నాయకులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను నువ్వు ఏమన్నావో..ఆ మాటలకు నీకు బుద్ధిలేదా అని అన్నాను. దానికి నువ్వు దొంగ కాల్స్ చేయించి మమ్మల్ని బెదిరిస్తావా..? బీసీ నాయకులంటే పడతలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఓ జాతిపిత లాంటివారు. చావునోట్లే తలకాయ పెట్టి తెలంగాణాను సాధించి..ఈనాడు దేశానికే తలమానికంగా తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే..అది చూసి ఓర్వలేక తండ్రి వయసున్న కేసీఆర్ ని పట్టుకొని చార్లెస్ శోభరాజ్ అంటావా..ఇలా ఇష్టవచ్చినట్లు కేసీఆర్ ని అంటుంటే..మీము మాత్రం నిన్ను ఏమి అనొద్దా..?
కేటీఆర్ , హరీష్ రావు లను పట్టుకొని బిల్లా రంగా అని మాట్లాడతావ్…ఇలా ఎవర్ని పడితే వాళ్లని అంటావ్. మహిళలను వదిలిపెట్టవు..నాయకులని వదిలిపెట్టవు..వ్యాపారస్తులను వదిలిపెట్టవు ..చిన్న , పెద్ద ఏమిలేదు..ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావ్..బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడతావ్. మరో నయీమ్ లెక్క మారాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని నడుపుతున్నట్లు లేదు ఓ దండుపాళ్యం బ్యాచ్ నడుపుతున్నట్లు ఉందని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 95 శాతం బీసీలు, ఎస్సి లు , ఎస్టీ పేద అన్ని కులాలకు చెందినటువంటి రైతులు ఉండే ప్రాంతం తెలంగాణ ప్రాంతం. మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్న పేద రైతులకు మూడు గంటలే పవర్ చాలని నువ్వు అమెరికా కు వెళ్లి అడ్డదిడ్డంగా మాట్లాడితే, అది తప్పు అని చెప్పడం తప్పా? . ఎందుకు ఇంత అక్కసు. చిన్న , సన్నకారు రైతుల పట్ల నీకు ఎందుకు ఇంత కోపం.
ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్న కారు రైతులు మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి పేద రైతులందరికీ అండగా ఉండి, వేలకోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి నీరు అందిస్తే..నీ కళ్ళలో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావ్ రేవంత్ రెడ్డి. నిత్యం కమిషన్లు , కాంట్రక్టులంటూ తిరిగే నువ్వు..ఈరోజు కేసీఆర్ గారు ఉచిత విద్యుత్ పంపిణీలో కమిషన్లకు పాల్పడుతున్నాడని అర్ధం పర్ధం లేకుండా ఆరోపించడం సిగ్గుచేటు. ఓ పక్క బీసీల ఫై కోపం , కేసీఆర్ ఫై కోపం చిన్న సన్న కారు రైతులఫై కోపం..ఇలా అందరిపై నీకుందుకు కోపం అని శ్రవణ్ ప్రశ్నించారు. ఈరోజు కేసీఆర్ గారు చిన్న సన్న కారు రైతులకు చేపలు , గొర్రెలు , బర్రెలు పంచుతూ.. వారికీ అన్ని విధాలా కెసిఆర్ న్యాయం చేస్తూ ఉంటె అది చూసి రేవంత్ రెడ్డి ఉర్వలేక , కళ్ళలో నిప్పులు పోసుకుంటూ కేసీఆర్ ఫై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు.
సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై రేవంత్ మాట్లాడుతున్నాడు..అసలు కాంగ్రెస్ పార్టీ కి 50 శాతం అభ్యర్థులు లేరు..ఉన్న 50 శాతం అభ్యర్థుల మధ్య గొడవలు పెట్టి ..ప్రతి నియోజవర్గంలో ఒకరిద్దరు , టీడీపీ నాయకులను రెచ్చగొట్టి , మిగతా వర్గాల్లో గొడవలు పెట్టి సెటిల్ మెంట్లు చేస్తున్నావ్. అసలు పార్టీని నడిపించే సత్తా ఉందా..? ప్రజల మధ్య పోరాటం చేసే లక్ష్యం ఉందా..? ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్ష్యం ఉందా..? అని ప్రశ్నించారు. రాజకీయాలను వ్యాపారం చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడని శ్రవణ్ ఆరోపించారు. ఈరోజు 10 , 12 సీట్లు వస్తే ..ఆ సీట్లను బీజేపీ పార్టీ తో బేరం పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఇలాంటి నయీమ్ నుండి దండుపాళ్యం బ్యాచ్ నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి ఫై ఉందని శ్రవణ్ అన్నారు.