HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cultivating A Marijuana Plant In A Rented House

కిరాయి ఉంటున్న ఇంట్లో గంజాయి మొక్కపెంపకం

  • Author : Vamsi Chowdary Korata Date : 01-01-2026 - 12:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganja Plant
Ganja Plant

Telangana : సిద్దిపేట జిల్లాలో పోలీసులు చేపట్టిన డ్రగ్స్ నిఘాలో ఓ విస్తుపోయే నిజం బయటపడింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తాను అద్దెకు ఉంటున్న ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కను పెంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. స్థానికుల అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఇంటి వెనుక దాచిన గంజాయితో పాటు మొక్కను స్వాధీనం చేసుకున్నారు.

  • ఇంటి వెనకాలే గంజాయి తోట
  • బెంగాల్ యువకుడి గుట్టురట్టు
  • సిద్దిపేట పోలీసుల మెరుపు దాడి

మాదకద్రవ్యాల నిరోధమే లక్ష్యంగా పోలీసులు సాగిస్తున్న నిఘాలో ఓ విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చి సిద్దిపేట జిల్లాలో ఉపాధి పొందుతున్న ఓ వ్యక్తి.. ఏకంగా తాను నివసిస్తున్న కిరాయి ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్కను పెంచుతూ పోలీసులకు చిక్కాడు. బుధవారం తొగుట సీఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ముర్షీదాబాద్‌కు చెందిన ఎస్‌.కె.రాకిబుల్‌ బతుకుదెరువు కోసం సిద్దిపేట జిల్లాకు వలస వచ్చాడు. కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలోని సీహెచ్‌ మంగవ్వ అనే మహిళ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి విత్తనాలు సేకరించిన రాకిబుల్ వాటిని తన ఇంటి పెరట్లో నాటాడు.

ప్రస్తుతం అతను సింగాటం గ్రామంలో పనులు చేస్తున్నప్పటికీ.. రెండు రోజులకోసారి లకుడారంలోని తన గదికి వచ్చేవాడు. ఆ గంజాయి మొక్కకు నీళ్లు పోసి అది పెరిగిన తర్వాత దాని ఆకులను తెంపి ఎండబెట్టేవాడు. అలా ఎండబెట్టిన గంజాయిని సిగరెట్లలో నింపుకొని ధూమపానం చేస్తూ వ్యసనానికి బానిసయ్యాడు. నిందితుడి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికుల నుంచి అందిన సమాచారంతో కుకునూరుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. లకుడారంలోని నిందితుడి నివాసంపై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు ఇంటి వెనకాల పెరుగుతున్న గంజాయి మొక్కను చూసి అవాక్కయ్యారు. అక్కడ ఎండబెట్టిన 140 గ్రాముల గంజాయితో పాటు సాగులో ఉన్న మొక్కను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లకుడారం బస్టాండు వద్ద మాటువేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు ఇంటి యజమానులకు కీలక సూచనలు చేశారు. బయటి వ్యక్తులకు లేదా ఇతర రాష్ట్రాల వారికి ఇళ్లు కిరాయికి ఇచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డులు, పూర్తి వివరాలు సేకరించాలన్నారు. గంజాయి వంటి నిషేధిత మొక్కలను పెంచడం లేదా డ్రగ్స్ విక్రయించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం నిందితుడిపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arrested
  • Ganja Plant
  • Rented House
  • siddipet
  • telangana
  • West Bengal

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

    Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd