Jani Master Police Custody: జానీ మాస్టర్ కు షాక్.. పోలీసుల కస్టడీకి అనుమతి
Jani Master Police Custody: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతన్ని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అయితే ఇప్పుడు నాలుగు రోజుల పాటు అతడిని పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు.
- Author : Praveen Aluthuru
Date : 25-09-2024 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
Jani Master Police Custody: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఈ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ (police custody) విధించింది. కోర్టు తీర్పుతో ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది. కాగా కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నార్సింగి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ ను కాసేపట్లో నర్సింగ్ పోలీసులు కస్టడీలోనికి తీసుకోనున్నారు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన డ్యాన్స్, కొరియోగ్రఫీతో అలరించిన కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ (jani master) పై తీవ్ర అత్యాచార ఆరోపణలు వచ్చాయి. జానీ మాస్టర్‌పై ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ అత్యాచారం, దోపిడీ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కేసు మరింత ఉత్కంఠగా మారింది. ఫలితంగా అతడిని 14 రోజుల రిమాండ్ కు పంపారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య అయేషా కూడా ఈ కేసులో ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో అయేషాను కూడా పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ఇదివరకే పోలీసులు ఆయేషాను నార్సింగి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే ఆమె మాత్రం తన భర్తకు సపోర్టుగా నిలిచింది. 16 ఏళ్ల వయసులో బాలిక వేధింపులకు గురైందన్న వాదన అవాస్తవమని చెప్పారు.
బాధితురాలు వెర్షన్ చూస్తే.. డ్యాన్స్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లినప్పుడు జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. తనపై జరిగిన వేధింపులను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని జానీ మాస్టర్ తనను బెదిరించాడని ఆమె పేర్కొంది. దీంతో నార్సింగి పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు జరిగినప్పుడు తాను మైనర్ అని బాధితురాలు వెల్లడించడంతో పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో తొలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ని నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Delhi : ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రభుత్వం సన్నాహాలు..