Corona Cases: హైదరాబాద్ పై కరోనా ఎఫెక్ట్, పెరుగుతున్న కేసులు
హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో కనీసం ఆరు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
- Author : Balu J
Date : 21-12-2023 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
Corona Cases: హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో కనీసం ఆరు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అకస్మాత్తుగా పాజిటివ్ కేసులు పెరగడంతో, కోవిడ్-19 పాజిటివ్‌తో లేదా లేకుండా మితమైన, తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులను పరీక్షించి, చికిత్స చేయవలసిందిగా ఆరోగ్య శాఖ కోరింది. కరోనావైరస్ కొత్త వేరియంట్‌పై ఆందోళనల నేపథ్యంలో ఏదైనా సంఘటనను పరిష్కరించడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు 104కు కాల్ చేసి 903022732 వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపవచ్చు.
కాగా ప్రస్తుతం అక్కడక్కడా వ్యాపిస్తున్న జెఎన్.1 రకం కరోనా వైర్‌సతో ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పేమీ లేదని మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. ఇది ఒమెక్రాన్ రకం వైర్‌సలోని ఉప వర్గానికి చెందినదని తెలిపింది. దీని వల్ల ప్రమాదమేమీ లేనప్పటికీ దీన్ని ‘ఆసక్తికలిగించే రూపాంతరం’ అన్న వర్గంలోకి చేర్చింది. ఇది బీఏ.2.86 రకం కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెంది జెఎన్.1 రకంగా మారిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లే దీనిని నివారించడానికి సరిపోతాయని తెలిపింది.
Also Read: China Earthquake: భూకంపం గురించి చైనాకు ముందే తెలుసా..? శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?