Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడాలి – హరీశ్ రావు
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll)పై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు
- Author : Sudheer
Date : 06-10-2025 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll)పై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ బైపోలులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని స్పష్టం చేశారు. ఓటర్లు ఇచ్చే తీర్పు ద్వారానే ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక లభిస్తుందని, అది ఆరు గ్యారంటీల అమలులో కఠినతరం, క్రమబద్ధతను తీసుకువస్తుందని సూచించారు.
Alum: పటికతో ఈ ఐదు రకాల పరిష్కారాలు పాటిస్తే చాలు.. మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
“జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడినా ప్రభుత్వం పడిపోదు, రేవంత్ సీఎం కుర్చీ నుంచి దిగిపోడు” అని స్పష్టం చేశారు. అయితే ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఈ బైపోల్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి చెక్ పెట్టాలని సూచించారు. ఈ ఓటమి ద్వారా కాంగ్రెస్ నాయకులకు ప్రజల ఆకాంక్షలు అర్థమవుతాయని, ప్రభుత్వాన్ని పునరాలోచన చేయడానికి ఇది ఒక సిగ్నల్ అవుతుందని ఆయన అన్నారు.
హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. ఆరు గ్యారంటీల అమలు పై అసంతృప్తి ఉన్నవారికి ఇది ఒక ఆవకాశంగా ఆయన చూపారు. బైపోల్స్ సాధారణంగా ప్రభుత్వాల పనితీరును కొలిచే లిట్మస్ టెస్ట్‌లా వ్యవహరిస్తాయి. హరీశ్ రావు చెప్పినట్లుగా ఓటర్లు తమ అసంతృప్తిని ఓటు రూపంలో వ్యక్తం చేస్తేనే అధికార పక్షం తగిన పాఠం నేర్చుకుంటుందనే వాదనకు ఆయన వాణి బలాన్ని చేకూర్చింది.