HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Partys Actions In Telangana Contradict Its National Manifesto

Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా ఉన్న ‘నేషనల్ కాంగ్రెస్ మేనిఫెస్టో’..?

ఒక పార్టీ నుండి ఎమ్మెల్యే గా కానీ ఎంపీ గా గాని గెలిచి , మరోపార్టీ లో చేరే వారిపై అనర్హత వేటు వేసేలా ఓ సవరణ తీసుకొస్తామని తెలిపారు

  • Author : Dinesh Akula Date : 05-04-2024 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cng Mani
Cng Mani

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ (Congress) పార్టీ నేడు తమ మేనిఫెస్టో (Manifesto ) ను విడుదల చేసింది. పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్ అనే పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ లు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మొత్తం 48 పేజీలతో కూడిన ఈ మేనిఫెస్టో లో ప్రధానంగా ఐదు న్యాయాల్ని అమలు చేస్తామని తెలిపారు. అందులో యువన్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ అమలు చేస్తామని హమీ ఇచ్చారు. అలాగే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ను సవరించేలా హామీ చేస్తున్నామని తెలిపారు. అంటే ఒక పార్టీ నుండి ఎమ్మెల్యే గా కానీ ఎంపీ గా గాని గెలిచి , మరోపార్టీ లో చేరే వారిపై అనర్హత వేటు వేసేలా ఓ సవరణ తీసుకొస్తామని తెలిపారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ..బిఆర్ఎస్ ను చిత్తూ చేసి భారీ విజయం సాధించింది. ఆ తర్వాత కూడా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా నేతలను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ వస్తుంది.

దీంతో వరుస పెట్టి బీఆర్‌ఎస్ సభ్యులు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోంది. డజనుకు పైగా అగ్రనేతలు మరియు వందలాది మంది కార్యకర్తలు పార్టీ శ్రేణులను కాంగ్రెస్ లో చేరారు..ఇంకా చేరుతూ..చేరేందుకు సిద్ధం అవుతున్నారు. సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం రాబోయే రోజుల్లో ‘భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరు’ అని తెలుపడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన కాసేపటికే బిఆర్ఎస్లోని కీలక వ్యక్తులు, రంజిత్ రెడ్డి మరియు దానం నాగేంద్రలు.. రేవంత్ మరియు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్..పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరిస్తుండడం చూసి..ఎక్కడ ప్రభుత్వం కూలుతుందో అనే భయం తో రేవంత్..ఇలా వరుసపెట్టి బిఆర్ఎస్ నేతలను చేర్చుకుంటున్నారని పలువురు బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు టీఆర్‌రావు వివరణ ఇచ్చారు. భారత రాజకీయాల్లో ఫిరాయింపులు కొత్తమీ కాదని.. పార్టీలు తమ స్థానాలను బలోపేతం చేసుకునేందుకు తరచూ ఇటువంటి వ్యూహాలను ఉపయోగిస్తాయని టీఆర్‌రావు చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఫిరాయింపుల వ్యవహారం మొదలుపెట్టిందే బిఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేసారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను , ఎంపీలను , ఎమ్మెల్సీ లను తన పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

2014 మరియు 2018 మధ్య, కేసీఆర్ 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు మరియు 18 మంది ఎమ్మెల్సీల ఫిరాయింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా, తన రెండవ టర్మ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మందితో సహా 14 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు పాల్పడ్డారు. వీరు మాత్రమే కాదు అనేక మంది సర్పంచ్‌లు, ZPTC, MPTC, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను బిఆర్ఎస్ లోకి ఆహ్వానించడం జరిగిందన్నారు.

ఇక రేపు తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభలోను బిఆర్ఎస్ కు చెందిన నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.   త్వరలో జరగబోయే లోక్‌సభ స్థానాలను పూర్తి స్థాయిలో కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ఫిక్స్ అయ్యింది. అందుకే బిఆర్ఎస్ లోని కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంది..ఇంకా చేర్చుకునే పనిలో ఉంది. బిఆర్ఎస్ సీనియర్ నేత కేశవ రావు, వరంగల్, చేవెళ్ల, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి , కడియం శ్రీహరి , కడియం కావ్య ఇలా చాలామంది కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. మరి ఇలా ఓపక్క పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే..మేనిఫెస్టో లో మాత్రం పార్టీ ఫిరాయింపులు చేసే వారిపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం ఏంటి అని అంత ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశం..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ హామీలు , మాటలు అన్ని కూడా మేనిఫెస్టో వరకే..అని చేతలు మాత్రం వేరేలా ఉంటాయనే విమర్శలు రాకపోవు.. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also : Diabetic Summer Drinks: ఈ వేస‌విలో షుగ‌ర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన డ్రింక్స్ ఇవే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Election Manifesto

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • DA Hike : ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్

    • Crime : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకును హత్యచేసిన ప్రియుడు

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

    • Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

    Trending News

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

      • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

      • నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd