Congress Govt : కాంగ్రెస్ పాలన కాదు పీడన – కేటీఆర్
Congress Govt : ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పాలనను పీడనగా అభివర్ణిస్తూ.. తెలంగాణ ప్రజల జీవితాలు అరణ్య రోదనగా మారాయని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై తగిన చర్యలు తీసుకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర చర్యలతో నష్టపరుస్తుందని విమర్శించారు.
- By Sudheer Published Date - 11:53 AM, Tue - 10 December 24

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై రోజు రోజుకు దూకుడు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియా చానెల్స్ లలో , సోషల్ మీడియా లలో , వేదికల పై ఇలా ఎక్కడైనా సరే కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేస్తూ..ప్రజల మద్దతు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పాలనను పీడనగా అభివర్ణిస్తూ.. తెలంగాణ ప్రజల జీవితాలు అరణ్య రోదనగా మారాయని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై తగిన చర్యలు తీసుకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర చర్యలతో నష్టపరుస్తుందని విమర్శించారు.
రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “రైతుల చెరబడితిరి, పేదల ఇండ్లు కూలగొడ్తిరి, రైతుబీమాకు పాతరేస్తిరి” అంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌లను తీసివేయడం, పథకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పెట్టి పోరాడిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని, అప్పటి సమైక్యవాదుల పంచన చేరి ప్రజలను వంచించిందని కేటీఆర్ విమర్శించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించడమే కాకుండా, నిరుద్యోగుల ఆశలను త్రొక్కారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అధికార అహంకారంతో ముందుకు సాగుతూ, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయడం దారుణమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. “మీరు చరిత్రను చెరిపేస్తాం అన్న భ్రమలో ఉంటే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఆలోచించండి” అంటూ హెచ్చరించారు. కేటీఆర్ చేసిన ఈ విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందనే ఆరోపణలు బలపడుతున్నాయి.
పాలన కాదు పీడన
ప్రజల వేదన
అరణ్య రోదనరైతుల చెరబడితిరి
పేదల ఇండ్లు కూలగొడ్తిరిరైతుబంధు ఎత్తేస్తిరి
రైతుభీమాకు పాతరేస్తిరికేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి ..
అమ్మవడిని ఆగం చేస్తిరినిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి
ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితిరిహామీల… pic.twitter.com/dMqAPFBg3s
— KTR (@KTRBRS) December 10, 2024
Read Also : Ishan Kishan: ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించింది ఈరోజే.. వేగవంతమైన డబుల్ సెంచరీ చేసి!