Congress PAC Meeting : తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ తీర్మానం
- Author : Sudheer
Date : 18-12-2023 - 4:07 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పాలు కీలక తీర్మానాలు చేసారు. పీఏసీ చైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వీ హనుమంతరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. పీఏసీ సమావేశం అనంతరం పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం.
We’re now on WhatsApp. Click to Join.
గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తాం. మహిళలకు నెలకు రూ. 2500 భృతిపై ఈ నెల 28న చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రూ. 4 వేల పెన్షన్ అమలు, విధివిధానాలపై చర్చిస్తున్నాం. ఈ నెల 28 నుంచి కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తాం అన్నారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారు.
తెలంగాణ చేపట్టిన ప్రాజెక్ట్‌ల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రాజెక్ట్‌ల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానం చేశాం. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేశారు. ఇక, త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్టీ. అలాగే, ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక్కో మంత్రికి ఇంఛార్జి భాధ్యతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
Read Also : Ponguleti Srinivas Reddy : సంక్రాంతి పండుగకు మరో రెండు గ్యారంటీలు అమలు – పొంగులేటి