Hyderabad : బిజెపి – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్ పిర్యాదు
- Author : Sudheer
Date : 12-12-2023 - 7:48 IST
Published By : Hashtagu Telugu Desk
బిజెపి , బిఆర్ఎస్ ఎమ్మెల్యేల (BJP-BRS Mlas) ఫై డీజీపీకి టీ కాంగ్రెస్ నేతలు (T Congress) పిర్యాదు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఫై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy), బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh)లు పలు ఆరోపణలు చేసారని, మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వీరు కామెంట్స్ చేసారని..వీరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత, టీకాంగ్రెస్ నేతలు చారుకొండ వెంకటేష్, మధుసూదన్‌లు మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటై 100 గంటలు గడవక ముందే ఇరు పార్టీల నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేశారని, బీజేపీ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందనే విషయాన్నిఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అవస్థలు తప్పవని ఆ పార్టీకి భారీ మెజార్టీ లేకపోవడంతో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, ఆరు నెలలకో ఏడాదికో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారని , మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ వచ్చే ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పారని , ఇక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉంటుందని కామెంట్ చేశారు.. కాంగ్రెస్ నేతలు వారికి వారే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని వ్యాఖ్యానించారు. ఇలా ఇరు పార్టీల నేతలు తమ ప్రభుత్వం ఫై కామెంట్స్ చేసారని టీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీ కి పిర్యాదు చేసారు. మరి దీనిపై డీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.
Read Also : Ration Cards: కాంగ్రెస్ పథకాలు అందాలంటే రేషన్ కార్డులు జరీ చేయాలి