Congress Groups : తెలంగాణ కాంగ్రెస్ లో `ఉదయ్ పూర్` కల్లోలం!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని (Congress Groups) రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఆందోళనకు గురి చేస్తోంది.
- By CS Rao Published Date - 04:31 PM, Fri - 1 September 23

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని (Congress Groups) రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఆందోళనకు గురి చేస్తోంది. దాని ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తే పార్టీలోని సీనియర్లకు చాలా మంది ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తోంది. ఆ డిక్లరేషన్ లోని ప్రధాన అంశాలను పరిగనణలోకి తీసుకుంటే, దాని ప్రభావం సోనియా కుటుంబీ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. ఉదయ్ పూర్ ప్లీనరీలోని చేసిన డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్. వయస్సు 70 సంవత్సరాలు మీదపడిన వాళ్లకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదు. అదే జరిగితే, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కనిపించే ఫేస్ లు దూరం అయ్యే ప్రమాదం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఆందోళన (Congress Groups)
రెండు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ.(Congress Groups) కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో మినహా చాలా వరకు గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక గ్రూపు రేవంత్ రెడ్డి వర్గంగానూ మరో గ్రూపు రేవంత్ రెడ్డి వ్యతిరేకమైనదిగా కాంగ్రెస్ క్యాడర్ విడిపోయింది. ఆ రెండు గ్రూపులను ఒకటి చేసే ప్రయత్నం ఫలించడానికి ఛాన్స్ కూడా కనిపించడంలేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలో పీసీసీ స్క్రీనింగ్ కమిటీ తొలి సమావేశం గందరగోళంగా ముగిసింది. ఆ సమావేశంలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాలకం నచ్చకపోవడంతో అర్థాంతరంగా వెళ్లిపోయారని గాంధీభవన్ వర్గాల టాక్. అయితే, ఆయన ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు.
రెండు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ
ప్రస్తుతం జనగాం నియోజకవర్గంలోని తాజా పరిస్థితిని తీసుకుంటే రెండు గ్రూపులు (Congress Groups)ఎలా పోట్లాడుకుంటున్నాయో అర్థమవుతోంది. అక్కడ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యయ్య తొలి నుంచి బలమైన కాంగ్రెస్ లీడర్ గా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇటీవల శాసనసభాపక్ష నేత భట్టీ విక్రమార్క్ పాదయాత్ర సందర్భంగా ఆ రెండు గ్రూపులు బాహాబాహికిగి దిగాయి. పాదయాత్ర సవ్యంగా నడవాలంటే, కొమ్మూరి గ్రూప్ దూరంగా ఉండాలని పొన్నాల కండీషన్ పెట్టారు. ఆ మేరకు పాదయాత్రలో కొమ్మూరిని పక్కన పెట్టడం ద్వారా భట్టీ యాత్ర అప్పట్లో కొనసాగింది. ప్రస్తుతం అక్కడ నుంచి పొన్నాలను తప్పించడం ద్వారా కొమ్మూరికి అభ్యర్థిత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. అక్కడ ఉదయ్ పూర్ తీర్మానం 70 ప్లస్ ఈక్వేషన్ ను అమలు చేస్తే లక్ష్మయ్యకు టిక్కెట్ వచ్చే ఛాన్స్ లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి వర్గీయుడుగా ఉన్న కొమ్మూరికి టిక్కెట్ వస్తుందని ఆశిస్తున్నారు.
Also Read : Rahul Gandhi: అమేథీ బరిలో రాహుల్ గాంధీ?
ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న జానారెడ్డి తన కుమారులకు టిక్కెట్లను అడుగుతున్నారు. కానీ, ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒకరికే టిక్కెట్. అదే జరిగితే, నాగార్జున సాగర్ వరకు జానా కుటుంబీకులు పరిమితం కావాలి. అలాగే మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి లో ఒకరికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలి. అంటే, హుజూర్ నగర్ లేదా కోదాడ వరకు ఉత్తమ్ కుటుంబీకులు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రెండు టిక్కెట్లను ఆశిస్తోన్న కాంగ్రెస్ పార్టీలోని మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, కొండా మురళి కుటుంబం, అంజనీకుమార్, సీతక్క లకు వర్తిస్తుంది. అలాగే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావాలనుకుంటోన్న మైనం పల్లి హనుమంతరావు రెండు టిక్కెట్లను ఆశిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేఖానాయక్ కూడా తన భర్తకు టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఇక మూడుసార్లు వరుసగా ఓడిన వాళ్లకు కూడా టిక్కెట్ లేదని ఉదయ్ పూర్ (Congress Groups) డిక్లరేషన్ చెబుతోంది.
Also Read : TCongress: టీకాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్న నేతలు
ఒక వేళ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేయాలని రేవంత్ రెడ్డి పట్టుబడితే, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ డిక్లరేషన్ ప్రకారం సోనియా కుటుంబంలోని ఒకరికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలి. ప్రస్తుతం సోనియా, రాహుల్, ప్రియాంక యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. అలాగే, ఏఐసీసీ చీఫ్ ఖర్గే తో పాటు ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. వాళ్లకు కూడా కుటుంబానికి ఒకరికే అనే నిబంధన పెడతారా? అంటే అసంభం. అందుకే, రాష్ట్రాల్లోని కొందరు సీనియర్లకు రిలాక్సేషన్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ నుంచి ఉంటుంది. ఆ విషయాన్ని దాటవేస్తూ రేవంత్ రెడ్డి వ్యవహరించడం సీనియర్లకు కొందరికి ఏ మాత్రం ఇష్టంలేదు. దీంతో గ్రూపు విభేదాలు తారాస్థాయికి ఆయా నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి.