CM Revanth : కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రేవంత్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరులో ఓ దివ్యాంగురాలికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు
- By Sudheer Published Date - 01:25 PM, Wed - 6 December 23

తెలంగాణ ముఖ్యమంత్రి గా రేపు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు , ఇతర రాష్ట్రాల సీఎంలు , మాజీ సీఎం లు హాజరుకాబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపిన రేవంత్..చెప్పినట్లే తెలంగాణలో మెుదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరులో ఓ దివ్యాంగురాలికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు.
నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు) రజినీ (Rajani) అనే అమ్మాయి పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కి చెప్పుకొని బాధపడింది. ఆమె ఆవేదనను చూసి చలించిపోయిన రేవంత్.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వస్తారని… అదే రోజున, వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని రజనికీ హామీ ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయటంతో పాటు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు. ఇక ఇప్పుడు రేపు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ తొలి జాబ్ రజనికి ఇవ్వబోతున్నారు.ఈ మేరకు రేపు జరిగే ప్రమాణ స్వీకారకార్యక్రమానికి రజినీకి ఆహ్వానం పంపించారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే రేపు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. కేసీఆర్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, కర్ణాటక సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కాంగ్రెస్ ముఖ్య నేతలు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణకం ఠాగూర్, చిదంబరం, మీరాకుమారికి ఆహ్వానం పంపారు. సుశీల్ కుమార్ షిందే, కురియన్ లకు ఆహ్వానం అందింది. వీరిలో ఎంత మంది హాజరవుతారన్నది తెలియాల్సి ఉంది.
Read Also : Chandrababu : రేవంత్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజవుతారా..?