HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Governments Aim Is To Make Hyderabad A Global City

Hyderabad Global City : హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్

Hyderabad a Global City : ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా మూసీ సుందరీ కరణ పేరుతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ది విషయంలో తాము వెనుకడుగు వేయబోమని

  • Author : Sudheer Date : 03-12-2024 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad A Global City
Hyderabad A Global City

హైదరాబాద్ గ్లోబల్ సిటీ (Hyderabad is a global city)గా మార్చాలనేది తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని , ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా మూసీ సుందరీ కరణ పేరుతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ది విషయంలో తాము వెనుకడుగు వేయబోమని స్పష్టం చేసారు సీఎం రేవంత్ (CM Revanth Reddy). హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద గల హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (HMDA Grounds) లో హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలను (Rising festival) మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రైజింగ్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని , నగర సుందరీకరణకు ప్రత్యేక నిధులను కేటాయించి, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించామని తెలిపారు. మూసీ నది అభివృద్ధి కార్యక్రమం ద్వారా నగరాన్ని విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. నగరానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా పలు ప్రాజెక్టులు చేపట్టామని, ఈ ప్రణాళికలను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా ఎదగడానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలు నాయకుల పాత్ర ఉందని సీఎం గుర్తుచేశారు. పిజెఆర్‌ వల్ల గోదావరి జలాలు నగరానికి చేరాయని, గత నాయకుల కృషి కూడా నగరాభివృద్ధికి దోహదపడిందని అన్నారు. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని, రీజనల్‌ రింగ్‌ రోడ్డుతో నగరానికి ప్రస్తుత వాహన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నగరాలైన న్యూయార్క్‌, టోక్యోలతో పోటీపడే సామర్థ్యం హైదరాబాద్‌ కలిగి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే నగరంలో ఉన్న పలు కంపెనీలు రాష్ట్ర ఆదాయానికి 65 శాతం మేర దోహదపడుతున్నాయని, మరిన్ని కంపెనీలు, పరిశ్రమలను ఆకర్షించేందుకు తగిన మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని సీఎం తెలిపారు.

Read Also : Delhi Super Power : షిండే వెనుక ‘సూపర్ పవర్’.. ఫడ్నవిస్‌‌ సీఎం కాకుండా అడ్డుకునే కుట్ర


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Congress Government
  • Hyderabad a global city
  • Rising festival

Related News

Cm Revanth

Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్ర

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Cm Convoy

    CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహ‌నాలు తగ్గింపు

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd