Hyderabad Global City : హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్
Hyderabad a Global City : ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా మూసీ సుందరీ కరణ పేరుతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ది విషయంలో తాము వెనుకడుగు వేయబోమని
- By Sudheer Published Date - 08:12 PM, Tue - 3 December 24

హైదరాబాద్ గ్లోబల్ సిటీ (Hyderabad is a global city)గా మార్చాలనేది తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని , ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా మూసీ సుందరీ కరణ పేరుతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ది విషయంలో తాము వెనుకడుగు వేయబోమని స్పష్టం చేసారు సీఎం రేవంత్ (CM Revanth Reddy). హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద గల హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (HMDA Grounds) లో హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలను (Rising festival) మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రైజింగ్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని , నగర సుందరీకరణకు ప్రత్యేక నిధులను కేటాయించి, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించామని తెలిపారు. మూసీ నది అభివృద్ధి కార్యక్రమం ద్వారా నగరాన్ని విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. నగరానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా పలు ప్రాజెక్టులు చేపట్టామని, ఈ ప్రణాళికలను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఎదగడానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలు నాయకుల పాత్ర ఉందని సీఎం గుర్తుచేశారు. పిజెఆర్ వల్ల గోదావరి జలాలు నగరానికి చేరాయని, గత నాయకుల కృషి కూడా నగరాభివృద్ధికి దోహదపడిందని అన్నారు. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని, రీజనల్ రింగ్ రోడ్డుతో నగరానికి ప్రస్తుత వాహన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యోలతో పోటీపడే సామర్థ్యం హైదరాబాద్ కలిగి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే నగరంలో ఉన్న పలు కంపెనీలు రాష్ట్ర ఆదాయానికి 65 శాతం మేర దోహదపడుతున్నాయని, మరిన్ని కంపెనీలు, పరిశ్రమలను ఆకర్షించేందుకు తగిన మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని సీఎం తెలిపారు.
Read Also : Delhi Super Power : షిండే వెనుక ‘సూపర్ పవర్’.. ఫడ్నవిస్ సీఎం కాకుండా అడ్డుకునే కుట్ర