Telangana: ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ ధీమా..
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి దూకుడుతో ముందుకు వెళ్తోంది.
- By Praveen Aluthuru Published Date - 10:59 AM, Sun - 15 October 23

Telangana: తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి దూకుడుతో ముందుకు వెళ్తోంది. బిజెపి ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే 119 మంది సభ్యుల అసెంబ్లీలో సగానికి ఎక్కువగా సీట్లు దక్కించుకుంటామని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆదరణ పెరగడంతో వేగంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకమైతే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని అంతర్గత సర్వేలో తేలింది. దేశ రాజధానిలో జరిగిన సీఈసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు ఐక్యంగా పని చేయాలని రాష్ట్ర నాయకులందరికీ విజ్ఞప్తి చేశారు, తద్వారా బీఆర్ఎస్ మరియు బీజేపీ లకు ఓటమి తప్పదని రాహుల్ అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టే బస్సు యాత్రలో రాహుల్ పాల్గొననున్నాడు. 17న రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు. 18 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలో పాల్గొంటారు. దీంతో కార్యకర్తల్లో మనోధైర్యం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పలు బహిరంగ సభల్లో ప్రసంగించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పలువురు సీనియర్ నేతల నేతృత్వంలో శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో మొత్తం 119 స్థానాల్లో 55 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. అయితే మిగిలిన సీట్లపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించి నాయకత్వానికి పంపనున్నారు. కాగా 119 మంది సభ్యుల తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: Dark Circles: డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా పోగొట్టండి..!