HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress And Bjp Believed In Lies And Did Nothing For The People Harish Rao

Harish Rao: కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి, ప్రజలకు చేసిందేమి లేదు

  • Author : Balu J Date : 13-04-2024 - 6:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: దుబ్బాక దౌల్తాబాద్‌లో జరిగిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘ ఎంతో పోరాడి, ఎన్నో త్యాగాలమీద కేసీఆర్ తెలంగాణను సాధించాడు. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాడు. కాంగ్రెస్ నాలుగు నెలల్లో వెనక్కి తీసుకెళ్లింది. కాంగ్రెస్ ఫేక్ వార్తలు, లీక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతులను ప్రాణాలు తీసింది. నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. 20 కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేదు, నల్లధనం వెనక్కి తీసుకురాలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో అబద్ధాలాడి గెలిచిన రఘునందన్ రావుకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పారు’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని బాండు రాసిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కాంగ్రెస్ ఉద్ధరించకుండా ఉద్దెర మాటలు మాట్లాడుతోంది. ఎన్నికల హామీలు అమలు కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మాకు బలం ఇవ్వాలి. ప్రజల మనిషి, కలెక్టర్‌గా పనిచేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న వెంకట్రామిరెడ్డిని గెలిపించుకోవాలి. రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు.. 500 బోనస్ వచ్చేదాకా కొట్లాడదాం’’ అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

‘‘రేవంత్ రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదు. రైతుబంధు 15 వేలు, ఆసరా పింఛన 4 వేలు, నిరుద్యోగ భృతి 4 వేలు, ఉచిత కరెంట్, ఆడపిల్లలకు తులం బంగారం, స్కూటీ.. ఈ హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. అమలైనవాళ్లు కాంగ్రెస్ పార్టీకి, కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి. నాలుగు నెలల్లోనే ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. సాగు నీళ్లు రాలేదు. మంచి నీళ్లు రాలేదు. 24 గంటల కరెంట్ బంద్ అయింది. కేసీఆర్ హయాంలో అమలైన కేసీఆర్ కిట్ బంద్ చేశారు. అభివృద్ధి కొనసాగించకుండా అడ్డుకుంటున్నారు’’ అని హరీశ్ రావు అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Govt
  • hard comments
  • harish rao
  • TCongress

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

Latest News

  • జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

  • రియల్ ఎస్టేట్ ఆశలపై నీళ్లు చల్లిన బడ్జెట్

  • అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

Trending News

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd