KTR in US: తెలంగాణలో కోకాకోలా భారీ పెట్టుబడులు
తెలంగాణాలో కోకాకోలా సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 03:27 PM, Sat - 26 August 23

KTR in US: తెలంగాణాలో కోకాకోలా సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కాగా తెలంగాణ ఐటి శాఖ మంత్రితో భేటీ అయిన కోకాకోలా సంస్థ ప్రతినిధులు తెలంగాణాలో మరో రూ.647 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇకపోతే సిద్ధిపేట గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌లో కొత్త లైన్లను ఏర్పాటు చేసేందుకు కోకా-కోలా రూ.647 కోట్ల అదనపు పెట్టుబడికి సిద్ధమైంది. ఇది డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతుంది.అందులో భాగంగానే కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందంతో కోకాకోలా అధికారులు న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. కరీంనగర్ లేదా వరంగల్ రీజియన్‌లో ఇదే తరహాలో రెండవ గ్రీన్‌ఫీల్డ్ తయారీ సౌకర్యం కల్పించబడుతోంది. ఈ కొత్త సదుపాయంతో తయారీ సామర్థ్యాలలో కోకా-కోలా మొత్తం పెట్టుబడులు రూ. 2500 కోట్లకు చేరుతుంది.
Also Read: YouTube Song Search : హమ్ చెయ్.. పాట వినెయ్.. యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ !