HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Worked With A Spirit On The Issue Of Caste Census

Caste Census Survey : కులగణన విషయంలో సీఎం రేవంత్ ఒక స్పిరిట్ తో పనిచేశారు – రాహుల్ గాంధీ

Caste Census Survey : “ఈ సర్వే చేయడం కష్టమని అనుకున్నాను, కానీ ఇది చరిత్రలో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. బీజేపీ అంగీకరించినా లేకపోయినా కులగణన జరగడం చారిత్రాత్మక ఘట్టం” అని రాహుల్ గాంధీ అన్నారు

  • Author : Sudheer Date : 24-07-2025 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Revanthcast
Rahul Revanthcast

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే (Caste Census Survey) దేశ చరిత్రలో ఓ కీలక మైలు రాయిగా నిలిచింది. ఈ సర్వే ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పూర్తిగా స్పూర్తితో నిర్వహించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశంసించారు. “ఈ సర్వే చేయడం కష్టమని అనుకున్నాను, కానీ ఇది చరిత్రలో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. బీజేపీ అంగీకరించినా లేకపోయినా కులగణన జరగడం చారిత్రాత్మక ఘట్టం” అని రాహుల్ గాంధీ అన్నారు. కులగణన హామీని భారత్ జోడో యాత్రలో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నెరవేర్చిందని తెలిపారు.

Ola S1 Sales: ఈ కంపెనీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వ‌ద్దంటున్న క‌స్ట‌మ‌ర్లు.. ఎందుకంటే?

ఈ సర్వే ప్రక్రియను సోనియా గాంధీ (Sonia Gandhi) స్వయంగా మెచ్చుకుంటూ లేఖ రాయడం విశేషం. ఈ లేఖ తనకు ఆస్కార్ అవార్డు, నోబెల్ ప్రైజ్ కన్నా ఎక్కువగా భావిస్తున్నట్టు సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. “తెలంగాణ మోడల్ అంటే ఇదే, దేశానికి దిశ చూపే విధంగా ఈ కులగణన సర్వే చేయడం జరిగింది. వందేళ్ల తర్వాత దేశంలో మొదటిసారిగా చొరవ చూపి ప్రజల నుంచి స్వయంగా వివరాలు సేకరించాం” అని వివరించారు. అగ్రకులాల నుంచి వచ్చిన అభ్యంతరాల్ని సామరస్యంగా పరిష్కరించామని కూడా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రధాని మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు, కేవలం లీగల్‌గా ఓబీసీ అయ్యారు. దేశం కోసం మోదీ ఏమీ చేయరు, ఓబీసీలకు మద్దతివ్వరు” అని విమర్శించారు. “రైతు నల్ల చట్టాలను వెనక్కి తిప్పే కృషి రాహుల్ గాంధీదే, ఇప్పుడు కులగణనను కేంద్రం అంగీకరించేందుకు కారణం కూడా ఆయనే. కానీ ఆర్‌ఎస్ఎస్ మాత్రం ఇప్పటికీ కులగణనకు వ్యతిరేకమే” అని స్పష్టం చేశారు.

Illegal Relationship : అక్రమసంబంధాల్లో హైదరాబాద్ ఏ ప్లేస్ ఉందో తెలుసా..?

కులగణన పూర్తయ్యాక ఏడాదిలోనే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు గర్వంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. “కాంగ్రెస్ ఉంటే అన్నీ ఉంటాయి, లేకపోతే ఏమీ ఉండదు. ఈ సర్వే నూటికి నూరుపాళ్లుగా ప్రజలే ఇచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించాం. ఈ గణన నిజాయితీగా జరిగిందని ఎవరికైనా అభ్యంతరం ఉంటే సాక్ష్యాలతో ప్రూఫ్ చేయాలని ఇదే నా ఛాలెంజ్” అని తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియ దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని సీఎం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Caste census Survey
  • cm revanth
  • delhi
  • rahul gandhi
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd