TG Assembly : ‘సార్’ కి ఫుల్ నాలెడ్జ్..అంటూ కేసీఆర్ ఫై సీఎం రేవంత్ సెటైర్లు
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుండు సున్నా ఇచ్చినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు
- By Sudheer Published Date - 02:50 PM, Sat - 27 July 24

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TG Assembly 2024) వాడివేడిగా నడుస్తున్నాయి. మంత్రి భట్టి (bhatti vikramarka) ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫై ఈరోజు శనివారం చర్చ జరిగింది. భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితమైందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) చేసిన కామెంట్స్ ఫై సీఎం రేవంత్ (CM Revanth ) తో పాటు పలు శాఖల మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. అలాగే గడిచిన పదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక స్కామ్ లు గురించి సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు గత బిఆర్ఎస్ అమ్మిందని, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని.. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని సీఎం రేవంత్ సెటైర్లు వేశారు.
We’re now on WhatsApp. Click to Join.
బతుకమ్మ చీరలు అని సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు రూ.94 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మారో లెక్క తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ తీరు వల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు రాలేదని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా, కొడంగల్ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వకూడదని బీఆర్ఎస్ కుట్రలు చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుండు సున్నా ఇచ్చినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. 2018 డిసెంబరు లోపల విద్యుత్ మీటర్ల బిగిస్తామని కేసీఆర్ కేంద్రానికి చెప్పారు. అధికారిక లెక్కలు చూసి హరీశ్ రావు స్పందించాలని సీఎం రేవంత్ తెలిపారు. ఇదే సందర్బంగా హరీష్ రావు , కేసీఆర్ లపై సెటైర్లు వేశారు. హరీష్ రావు కు హాఫ్ నాలెడ్జ్…ఇంకో పెద్దాయనకు ‘ఫుల్’ నాలెడ్జ్ అంటూ పరోక్షంగా కేసీఆర్ ఫై సెటైర్లు వేశారు.
Read Also : Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?