CM Revanth Reddy Speech : జపాన్ లో తెలుగు స్పీచ్ తో అదరగొట్టిన సీఎం రేవంత్
CM Revanth Reddy Speech : టోక్యోలో జరిగిన తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు
- By Sudheer Published Date - 03:26 PM, Sat - 19 April 25

జపాన్ పర్యటన(Japan Tour)లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్పీచ్ (CM Revanth Reddy) తో అదరగొట్టారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రజల ముందు ఉంచారు. టోక్యోలో జరిగిన తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. త్వరలో తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మూసీ నదీ ప్రక్షాళన అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డు పడుతున్నాయని ఆరోపించిన సీఎం, “నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక” అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు.
అక్కడ నాకు గుడి ఉంది.. ఇక్కడ కూడా కడితే చూడాలని ఉంది : ఊర్వశి రౌతేలా
నగర అభివృద్ధి పనుల్లో భాగంగా నాలాల ఆక్రమణలు తొలగించకుండా, చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఉండగలవా? అని ప్రశ్నించిన సీఎం, “ఇవి తొలగించకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు” అని హెచ్చరించారు. ఢిల్లీ వంటి పట్టణాల పరిస్థితిని చూసి గుణపాఠం నేర్చుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఈ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని స్పష్టం చేశారు.
పర్యటనలో భాగంగా సీఎం టోక్యోలో పలు ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. NTT డేటా, నెయిసా నెట్‌వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో రూ.10,500 కోట్ల విలువైన AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. అలాగే రుద్రారంలో తోషిబా సంస్థ రూ.562 కోట్లతో TTDI సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులు తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముందుకు తీసుకెళ్తాయని సీఎం రేవంత్ తెలిపారు. 500 మెగావాట్ల విద్యుత్తుతో నడిచే ఈ డేటా క్లస్టర్ ప్రపంచ స్థాయిలో టెక్నాలజీకి నిదర్శనంగా నిలవనుంది.