Telangana Assembly Session 2023: కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ రేవంత్ సెటైర్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాటలకూ ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు
- By Praveen Aluthuru Published Date - 02:45 PM, Sat - 16 December 23

Telangana Assembly Session 2023: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాటలకూ ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
కాంగ్రెస్ ఎప్పటికీ విపక్షమే అన్న కేటీఆర్ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసెంబీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం గురించి ఎంత చెప్పినా అర్థం కాదన్నారు. అచ్చోసిన ఆంబోతులా పోడియంకు వస్తాం అంటే అది కరెక్ట్ కాదని సీఎం చెప్పారు. చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో గత పాలన గూర్చి మాట్లదుడామంటే రోజంతా చర్చకు సిద్ధమన్నారు రేవంత్.
కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. కేసీఆర్‌కు సింగిల్ విండో ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలా సభలో కేటీఆర్ కామెంట్స్ పై రేవంత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
Also Read: Hatchback And Sedan: హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారు మధ్య తేడా ఏమిటి? మీకు ఏది బెస్ట్ గా ఉంటుందంటే..?