CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఏస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏండ్లు పోరాంటం చేశారు..సీఎం
- By Latha Suma Published Date - 01:30 PM, Thu - 1 August 24

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ(SC and ST classification)పై కీలక ప్రకటన చేశారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. గత ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని.. అందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
మాదిగ, మాదిగ ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందనన్నారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
మరోవైపు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. సీఎం రేవంత్ ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్‌ను నియమించి.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. తీర్పు సమన్యాయం, సమ ధర్మం అని.. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే పోరాటం జరిగిందన్నారు. ఈ విషయం తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదన్నారు.