HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy In Most Powerful Indians List 2025

CM Revanth Reddy: అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి!

ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్య‌ధిక శ‌క్తిమంతులైన 100 మంది ప్ర‌ముఖుల‌తో జాబితా విడుద‌ల చేసింది.

  • Author : Gopi Date : 29-03-2025 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Govt
Telangana Govt

CM Revanth Reddy: త‌న ప‌రిపాల‌నా నైపుణ్యం.. ప్ర‌భావంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యంత శ‌క్తిమంత‌మైన నాయ‌కునిగా నిలిచారు. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్య‌ధిక శ‌క్తిమంతులైన 100 మంది ప్ర‌ముఖుల‌తో జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం ద‌క్కించుకున్నారు. 2024 సంవ‌త్సర‌పు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగ‌బాకి 28వ స్థానానికి చేరుకోవ‌డం విశేషం. దేశంలో రాజ‌కీయ‌, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్య‌క‌లాపాలు, దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మిలో పోషిస్తున్న ప్ర‌ముఖ‌మైన పాత్ర‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ల‌భించింది. త‌నదైన దూకుడుతో భార‌త‌ రాజకీయాల్లో ఆయ‌న చూపుతున్న ప్ర‌భావం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ర్యాంకు మెరుగుప‌డింది. ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌వించారు.

ఈ జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూట‌మిలోని ఇతర ప్ర‌ముఖులైన సీఎంల సరసన నిలిపింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీల‌క నాయ‌కునిగా నిలిపేలా చేశాయి. శ‌క్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.

Also Read: Myanmar Earthquake Updates: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 144కు చేరిన మృతుల సంఖ్య‌?

విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌తో

రైతు కుటుంబాల‌కు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేయ‌డం, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోన‌స్ ఇవ్వ‌డం, మహిళా స్వయం సహాయక సంఘాల‌కు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం, యువ‌త‌ను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణ‌యాలు దేశ‌వ్యాప్తంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌జాద‌ర‌ణ పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై చెన్నై స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్య‌క్తం చేసిన దృఢ‌మైన అభిప్రాయాలు కూడా ఆయ‌న‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ద‌క్కేలా చేశాయి.

పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌, రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి క‌ట్టుబ‌డినందునే *ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శ‌క్తిమంతుల జాబితా-2025లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి గుర్తింపు ల‌భించింద‌ని పీసీసీ అధ్య‌క్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఈ గుర్తింపుతో దేశ‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌ ప‌ట్ల ముఖ్య‌మంత్రి గారి బాధ్య‌త‌ను మ‌రింత పెంచింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

భార‌తీయ శ‌క్తిమంతులైన జాబితాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి చోటు ల‌భించ‌డం భార‌త రాజ‌కీయాల్లో కీల‌క మార్పున‌కు సంకేత‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌మ‌ని వారు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Most Powerful Indians List 2025
  • pm modi
  • revanth reddy
  • Telangana CM Revanth

Related News

    Latest News

    • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

    • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

    • Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

    • Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

    • CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd