Revanth Reddy Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే పరిపాలన విధానాలు మొదలు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లారు
- By Praveen Aluthuru Published Date - 07:40 PM, Thu - 7 December 23

Revanth Reddy Cabinet Meeting: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే పరిపాలన విధానాలు మొదలు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా సచివాలయానికి వెళ్లారు.సచివాలయానికి చేరుకున్న మంత్రులతో పాటు రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఘనస్వాగతం పలికారు . సీఎం రేవంత్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సచివాలయంలోని 6వ అంతస్తుకు వెళ్లారు. అనంతరం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీలపై చర్చించి అమలుకు ప్రణాళిక రూపొందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఆరు గ్యారంటీల అమలు తేదీని ప్రకటించే అవకాశముంది. కాగా కొన్ని గంటలుగా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది.
Also Read: Hair Tips: అబ్బాయిలు మీరు అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే బట్టతల రావడం ఖాయం!