CM Revanth – Delhi : ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్.. హైకమాండ్‌తో చర్చించే అంశాలివీ
CM Revanth - Delhi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెెళ్లనున్నారు.
- Author : Pasha
Date : 19-12-2023 - 7:21 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth – Delhi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెెళ్లనున్నారు. సోమవారం రోజు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై పార్టీ హైకమాండ్‌తో చర్చించేందుకు ఆయన హస్తినకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పది రోజుల పాలనా కాలం అనుభవాల గురించి.. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణ గురించి ఈ భేటీలో డిస్కషన్ జరుగుతుందని అంటున్నారు. ఈ నెల 24న లేదా 25న రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ల సూచనల మేరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధానంగా 6 మంత్రి పదవుల పంపకంపై అధిష్టానం సలహాలను రేవంత్ తీసుకోనున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తూ మంత్రివర్గం కూర్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రిమండలిలో 11 మంది మంత్రులున్నారు. మిగతా మంత్రి పదవుల కేటాయింపునకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించనున్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్(CM Revanth – Delhi) కలువనున్నారు.